వికారినామ సంవత్సరం ధనస్సురాశి ఫలితాలు

By ramya N  |  First Published Apr 6, 2019, 6:46 AM IST

తెలుగు సంవత్సరాదిలో ధనస్సు రాశి ఫలితాలు


ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా) : ఆదాయం - 2, వ్యయం - 8; రాజపూజ్యం- 6, అవమానం - 1;

          ఈ రాశివారికి గురువు నవంబర్‌ 2019 వరకు వ్యయంలోను తరువాత సంవత్సరం జన్మరాశిలోనూ సంచరిస్తాడు.  ధార్మిక కార్యక్రమాలకు ఖర్చులు చేస్తారు. గృహనిర్మాణాలకై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. అనుకోని ఇబ్బందులు గౌరవ లోపాలకు అవకాశం ఏర్పడుతుంది. దాన ధర్మాలకు ఖర్చు చేయడం మంచిది.

Latest Videos

undefined

నవంబర్‌ తర్వాత జన్మరాశిలో సంచరించడం వలన ఉద్యోగులకు బదిలీలకు అవకాశం. ఆత్మ విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం. శ్రమతో కార్యనిర్వహణ, విజయం లభిస్తాయి. ఆలోచనలకు అనుకూలం. సంతానవర్గ అభివృద్ధి. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. పరిచయాలు విస్తరిస్తాయి. అన్ని పనుల్లో సంతృప్తి లభిస్తుంది. దూర ప్రయాణాలకు అవకాశం. శని దాదాపుగా 2020 జనవరి వరకు ఈ రాశిలోనే సంచారం వలన కొంచెం బద్ధకం అధికం. అన్ని పనుల్లో ఆలస్యం ఉంటుంది.

నిర్ణయాదులు సమీక్షించుకోవాలి. కార్యక్రమాలన్నీ వాయిదా పడుతుటాంయి. యోగ, ప్రాణాయామాదులు అవసరం. సేవకజన సహకారం లభిస్తుంది. తాము ఇతరులకు సేవాదులు నిర్వహించాలి. పరిచయాలు, భాగస్వామాల్లో లోపాలుటాంయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. శ్రమ అధికమౌతుంది.

రాహువు సప్తమంలో సంచారం వలన సామాజిక అనుబంధాలు పెంచుకుటాంరు. అనవసర ఖర్చులు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. నూతన పరిచయాల వల్ల జాగ్రత్తగా ఉండాలి. కేతువు తమ రాశిలో సంచారం వలన  కొంత చేసే పనుల్లో నిరాశ నిస్పృహలు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. కాలం, శ్రమ, ధనం అన్నీ వృథా అవుతాయి. ఈ రాశివారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి.

వీరికి గ్రహణ ప్రభావం కూడా ఉంటుంది. కావున  అస్సలు ఏ రకంగా కూడా దాచుకోవాలనే ఆలోచన మంచిది కాదు. వీరు పశుపక్షాదులకు ఆహారం, నూనె / పల్లీలు, పళ్ళు / విద్యార్థులకు పుస్తకాలు, / హోమాలకు ఆవునెయ్యి / చెట్లు నాటిచడం లాటి పనులు అధికంగా చేయాలి. వీరు గణపతి స్తోత్ర పారాయణ, శివుడికి అభిషేకం, హరహరశంకర జయజయ శంకర జపం చేసుకోవడం మంచిది.

 

ఏకాత్మభావన : ఈశ్వరోగురురాత్మేతి మూర్తి త్రి త్రయ స్వరూపిణే ఆనందాత్మ స్వరూపాయ దక్షిణామూర్తయే నమః

ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉన్న రాశులు :  సింహం, ధనుస్సు, మీనం

గృహప్రాప్తి మంత్రం :  చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగరనాయికా, 

ఇల్లు కాకుండా స్థలం కొనుక్కుందామనుకుంటే

స్థల ప్రాప్తి మంత్రం : శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ, త్రివిక్రమాయ నమః,

దాన ధ్యానం : జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి. ఈ జపాలు చేసుకుంటూ ఉండాలి.

డా.ఎస్.ప్రతిభ

ఇతర రాశుల వారి ఉగాది ఫలితాలు

మేషరాశి ఫలితాలు

వృషభరాశి ఫలితాలు

మిథునరాశిఫలితాలు

కర్కాటక రాశివారి ఫలితాలు

సింహరాశి ఫలితాలు

కన్యారాశి ఫలితాలు

తులరాశి ఫలితాలు

వృశ్చిక రాశి ఫలితాలు

click me!