వృశ్చికరాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

By ramya neerukondaFirst Published Aug 30, 2018, 2:11 PM IST
Highlights

తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరులకు సహాయం చేస్తారు. తొందరగా ఎవరినీ ఏమీ అనరుకాని తమను ఇబ్బంది పెట్టినవారిని మాత్రం ఏదో రకంగా ఆ ఇబ్బందులనుండి బయట పడడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. జాగ్రత్తగా ఉంటారు.

అందమైన శరీరం, ఆజానుబాహువులు, పొట్టిగా వంకర తిరిగిన వెంట్రుకలు, విశాలమైన ముఖం కలిగి ఉంటారు. వీరికి మనోనిగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఇతరులకంటే తామే గొప్ప అనే స్వభావం, పట్టుదల, కార్యదీక్ష, ముక్కోపం, నటనా కౌశలం, ఆధ్యాత్మిక చింతన, స్వార్థం ఉంటాయి. వీరు గూఢచారులుగా వ్యవహరిస్తారు. ఒక రక్షణ విభాగంలోనే కాక వేరువేరు విభాగాల్లో పనిచేస్తారు.

ఎందులో చేసినా ఆ పని తమ పనిలాగా భావిస్తూ చేస్తారు. కాబట్టి కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు. అత్యవసరమైనతే తప్ప తిరిగే పనులు ఎక్కువగా ఇష్టపడరు. నీరంటే కొంత భయం ఉంటుంది. బయటకి ధైర్యంగా కనిపించినా పిరికివారుగా ఉంటారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరులకు సహాయం చేస్తారు. తొందరగా ఎవరినీ ఏమీ అనరుకాని
తమను ఇబ్బంది పెట్టినవారిని మాత్రం ఏదో రకంగా ఆ ఇబ్బందులనుండి బయట పడడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. జాగ్రత్తగా ఉంటారు.

వృశ్చికం సహజ అష్టమమై బలహీనంగా ఉండే వీరికి అనుకోని అనారోగ్య సమస్యలు రావడం, అనవసర ఖర్చులు లాంటివి ఉంటాయి. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. ఉదా : ఏ పని చేసినా కలిసి రావడం లేదు - ఊహించని నష్టాలు వస్తున్నాయి - ప్రతి ప్రయోజనానికి అత్యధికమైన శ్రమకు గురి అవుతున్నాను - అనారోగ్య సమస్యలు అధికమౌతున్నాయి - వ్యాపార వ్యవహారాల్లో లోపాలు వస్తున్నాయి వంటివి సాధారణంగా అష్టమ భావానికి సంబంధించిన ప్రశ్నలు.

అష్టమాధిపతి లగ్నాధిపతితో కూడినా, సంబంధం పొందినా, అష్టమాధిపతి షష్ఠ వ్యయాలలో ఉన్నా (విపరీత రాజయోగం), అష్టమాధిపతిపై శుభగ్రహాల ప్రభావాలు లేకపోయినా, అష్టమంలో లగ్నాధిపతి ఉన్నా, అష్టకవర్గులో అష్టమంలో 24 కన్నా తక్కువ బిందువులు ఉన్నా, భిన్నాష్టక వర్గులో ఒక గ్రహం అష్టమంలో 4 కన్నా తక్కువ బిందువులను ఇవ్వడం వంటి అష్టమభావ లోప సంబంధమైన ఆలోచనలకు అవకాశం అధికం.

అందరి వద్ద ధనం, వస్తువులు తీసుకొని వారిని మోసం చేయడం, జీవులను, మనుష్యులను ఏ హాని చేయకుండానే కోపంతోనూ, తమ ఆనందం కోసం చంపడం, వేధించడం, ఎదుటివారికి ప్రయోజనాలు రాకుండా నష్టపరచి తాము ఆనందించడం, అందరినీ విపరీతమైన శ్రమకు గురి చేయడం వంటి పూర్వకర్మ లోపాలకు ప్రస్తుతం ఇటువంటి జాతకం ఏర్పడి, ఈ భావనలకు కారణం అవుతుంది.

అష్టమం ఆకస్మిక నష్టాలు, ప్రమాదాలు సూచిస్తుంది కావున వీరు ఆకస్మిక నష్టాల నుండి బయట పడాలంటే దానాలు అధికంగా చేయాలి. ఎంత శ్రమ చేసినా వ్యర్థం అయ్యే అవకాశం, ఊహించని నష్టాలు పొందే అవకాశం ఈ జాతకులకు ఉండడం వల్ల ముందే దానధర్మాల రూపంలో ఆర్థికంగా, సేవాపరంగా, సత్కార్యాచరణ ద్వారా ఉపయోగపడడం వల్ల పుణ్యబలాలు వృద్ధి చెంది బలవంతమైన నష్టాలు ఏర్పడకుండా ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. 


ప్రకృతికి పశుపక్ష్యాదులకు, సమాజానికి ఎప్పటికీ మేలు కలగాలనే భావనతో దానం, ధ్యానం చేయడం ద్వారా, కాలం ధనం శ్రమలు సద్వినియోగం అయ్యే ప్రయత్నాలు చేయడం ద్వారా జ్యోతిర్వైద్య రీత్యా కర్మ లోపాలకు పరిష్కారం లభిస్తుంది.

ప్రకతిలో అన్ని సంపూర్ణాలే. లోకంలో ఏదీ అసంపూర్ణము లేదు. ప్రమాద భావనలు కూడా ఎప్పటికీ లేవు. నష్టము అనేది ప్రకృతికి లేదు. పరమాత్మ పూర్ణుడు, ఆనందమయుడు. శరీరం నిరంతరం చైతన్యంతో ఉంది. అన్ని పనులు సమృద్ధిగా నిర్వహించగలిగే శక్తి సామర్థ్యాలు శరీరానికి ఉన్నాయి అనే భావనల వల్ల, ఆలోచనల్లో మార్పుల వల్ల లోపాల నివారణకు అవకాశముంది. వీరు ప్రతిరోజు దానాలు చేయడం వలన తమ కర్మదోషాలను తగ్గించుకోవచ్చు.

డా. ప్రతిభ

ఇవి కూడా చదవండి

తుల రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

కన్య రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

జ్యోతిష్యం.. సింహ రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. కర్కాటక రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. మిథునరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. వృషభరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

‘మేషరాశి’ వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

click me!