ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఆహార సౌకర్యం లభిస్తుంది. ప్రయాణాల్లో సంతోషం ఉంటుంది. వాహన సౌకర్యం లభిస్తుంది. కార్యాలయాల్లో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. సుగంధ ద్రవ్యాలపై ఆసక్తి పెరుగుతుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వ్యాపారస్తుల వల్ల సహకారం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. రచనలపై ఆసక్తి ఉంటుంది. తోివారితో సంభాషణలు ఉంటా యి. కమ్యూనికేషన్స్ అభివృద్ధి చెందుతాయి.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు లాభిస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మాటలవల్ల గౌరవం పెరుగుతుంది. ధనాన్ని పెంచుకునే ప్రయత్నంపై దృష్టి ఉంటుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శారీరక శ్రమ కొంత ఒత్తిడి కలిగిస్తుంది. ప్రణాళికాబద్ధమైన జీవితం ఉంటుంది. పనుల్లో అనుకూలత ఉంటుంది. పట్టుదలతో కార్య సాధన చేస్తారు. ఆలోచనల్లో మార్పులు ఉంటా యి. పనులు ఫలిస్తాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. విహార యాత్రలపై దృష్టి ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తెలియని ప్రదేశాలకు వెళ్లాలనే ఆలోచన.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వివిధ వస్తువులపై దృష్టి ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. సమిష్టిగా కృషి చేస్తారు. సమిష్టి ఆదాయాలపై ఆలోచన ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఉద్యోగాదుల్లో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవం ఉంటుంది. సాంఘిక రాజకీయ విషయాలపై చర్చ చేస్తారు. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శుభకార్యాల్లో పాల్గొంటారు . విదేశ వ్యవహారాలపై దృష్టి ఏర్పడుతుంది. సజ్జన సాంగత్యం ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. దూరదృష్టి పెరుగుతుంది. గురువులతో అనుకూలత ఏర్పడుతుంది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అనవసర ఖర్చులు చేస్తారు. ఊహించని ఇబ్బందులు ఉంటా యి. ప్రయాణాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. లాభనష్టాలు అనుకూలంగా ఉంటా యి. వైద్యశాలల సందర్శనం చేస్తారు.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వ్యాపారస్తుకు అనుకూల సమయం. వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. నూతన పరిచయాలు అనుకూలం. భాగస్వాములకు సంతోషకర వాతావరణం. పదిమందిలో పలుకుబడి పెరుగుతుంది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : రోగనిరోధక శక్తి పెరుగుతుంది.వృత్తి విద్యల వల్ల సంతోషం ఏర్పడుతుది. శతృవులపై విజయం సాధిస్తారు. పోటీ ల్లో గెలుపు సాధిస్తారు. ఋణ సంబంధ ఆలోచనల్లో విముక్తి లభిస్తుంది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సంతాన సంబంధ ఆలోచనల్లో అనుకూలత. సృజనాత్మకత పెరుగుతుంది. కళలపై ఆసక్తి ఏర్పడుతుంది. పరిపాలన సమర్ధత ఏర్పడుతుంది. పరిశోధనలపై దృష్టి పెంచుకుంటారు
డా.ప్రతిభ
ఇవి కూడా చదవండి
ఈ వారం( 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి