మేమే చెప్పాం, అందుకే ఇంటలిజెన్స్ డీజీ బదిలీ: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

By narsimha lodeFirst Published Mar 27, 2019, 2:43 PM IST
Highlights

ప్రత్యర్థి పార్టీల సమాచారాన్ని తెలుసుకొనేందుకుగాను ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ప్రయత్నిస్తున్నారని తాము ఇచ్చిన సమాచారం మేరకు ఈసీ అతడిని బదిలీ చేశారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
 


హైదరాబాద్:ప్రత్యర్థి పార్టీల సమాచారాన్ని తెలుసుకొనేందుకుగాను ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ప్రయత్నిస్తున్నారని తాము ఇచ్చిన సమాచారం మేరకు ఈసీ అతడిని బదిలీ చేశారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

బుధవారం నాడు వైసీపీ కార్యాలయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి  మీడియాతో మాట్లాడారు.వైసీపీని, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను ఇబ్బందిపెట్టే ప్రక్రియ  చేస్తే ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టుగా టీడీపీ నేతలు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులు, పార్టీలను ఇబ్బందిపెట్టేందుకు గాను  ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ప్రయత్నిస్తున్నారని ఆయనఆరోపించారు.వ్యక్తిగత జీవితాల్లోకి కూడ ఇంటలిజెన్స్ డీజీ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 

తన ఫోన్‌ను కూడ ట్యాప్ చేస్తున్నారని తేలిందన్నారు.  దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించినట్టుగా ఆయన తెలిపారు.సహేతుకమైన కారణాలను చూపని కారణంగానే ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లానని ఆయన తెలిపారు.

ఈ కారణాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లిన కారణంగానే  ఈసీ ఏబీ  వెంకటేశ్వరరావును తప్పించారని ఆయన అభిప్రాయపడ్డారు.ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తన విధులను అతిక్రమించి రాజకీయాల్లో జోక్యం చేసుకొంటున్నారని ఆయన చెప్పారు.

వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు మధ్యవర్తిగా ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారని ఆయన ఆరోపించారు. ఇంటలిజెన్స్ అధికారులు చేయాల్సిన పనిని చేయకుండా  రాజకీయాల్లో తలదూరుస్తున్నారని ఆయన విమర్శించారు.

ప్రత్యర్థి పార్టీలకు చెందిన సమాచారాన్ని తెలుసుకొనేందుకు  ఇంటలిజెన్స్ అధికారులు పనిచేశారని చెప్పారు. కొందరు హ్యాకర్ల ద్వారా ఈ పనిని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ఇంటలిజెన్స్ విభాగంలో పోస్టులను భారీగా పెంచారని ఆయన వివరించారు. డీఎస్పీ, అదనపు ఎస్పీ పోస్టులను పెంచారన్నారు.

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్‌తో పెట్టుకొంటే ఇందిరా ఏమయ్యారో తెలుసు కదా: కోడెల

నేరస్తుడి ఫిర్యాదుతో ఐపీఎస్‌లను బదిలీ చేస్తారా: చంద్రబాబు ఈసీ‌పై మండిపాటు

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు: ఈసీపై చంద్రబాబు సీరియస్

 

click me!