నెల్లూరులో మంత్రి నారాయణకు షాక్.. వైసీపీలోకి తోడల్లుడు

By Siva KodatiFirst Published Mar 27, 2019, 2:00 PM IST
Highlights

నెల్లూరు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. అధికార, ప్రతిపక్షాలు రెండు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో మంత్రి నారాయణకు ఊహించని షాక్ తగిలింది

నెల్లూరు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. అధికార, ప్రతిపక్షాలు రెండు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో మంత్రి నారాయణకు ఊహించని షాక్ తగిలింది.

మంత్రి తోడల్లుడు రామ్మోహన్‌తో పాటు పలువురు అనుచరులు టీడీపీని వీడి... వైసీపీలో చేరారు. మంత్రి నారాయణ విధానాలు నచ్చని పలువురు టీడీపీని వీడుతున్నారని.. రామ్మోహన్ రావడం వల్ల తమ పార్టీ మరింత బలపడుతుందని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

నెల్లూరు నగరాన్ని రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేశామని చెబుతున్న మంత్రి నారాయణ... డబ్బుతో ఓట్లు ఎందుకు కొంటున్నారని ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు నారాయణ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గెలుపు కోసం ఆయన ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో నారాయణ తన విద్యాసంస్థలకు చెందిన ఉద్యోగులతో సర్వేలు చేయించటంతో పాటు వారితో ఓటర్లకు నగదు చేరవేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం నెల్లూరులోని చిన్న బజార్‌ టీడీపీ కార్యాలయంలో నగదు బ్యాగులను వైసీపీ నేతలు పట్టుకోవడం సంచలనం కలిగించింది. 
 

click me!