పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: ఎంపిక చేసిన వైఎస్ జగన్

By Nagaraju penumalaFirst Published Mar 11, 2019, 10:24 PM IST
Highlights

వైఎస్ జగన్ ఉభయగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొందాలని వ్యూహరచన చేస్తున్నారు. గెలుపు గుర్రాళ్లకే టిక్కెట్ ఇవ్వాలన్న నేపథ్యంలో ఆచి తూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. బలహీనంగా ఉన్న అభ్యర్థుల విషయంలో మరోసారి చర్చించి నిర్ణయం ప్రకటించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధిక శాతం అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే పాలకొల్లు అసెంబ్లీ విషయంలో మాత్రం కచ్చితమైన నిర్ణయం ప్రకటించలేదు జగన్.  

హైదరాబాద్: హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమరానికి రెడీ అయ్యారు. అన్ని పార్టీల కంటే ముందుగా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల సమరశంఖారాం పూరించిన వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. దాదాపు అన్ని జిల్లాలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఖారు చేసి ఎన్నికల ప్రచారానికి రెడీ అవ్వాలని జగన్ భావిస్తున్నారు. 

అందులో భాగంగానే లండన్ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ ఉభయగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొందాలని వ్యూహరచన చేస్తున్నారు. 

గెలుపు గుర్రాళ్లకే టిక్కెట్ ఇవ్వాలన్న నేపథ్యంలో ఆచి తూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. బలహీనంగా ఉన్న అభ్యర్థుల విషయంలో మరోసారి చర్చించి నిర్ణయం ప్రకటించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధిక శాతం అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే పాలకొల్లు అసెంబ్లీ విషయంలో మాత్రం కచ్చితమైన నిర్ణయం ప్రకటించలేదు జగన్.  
1. కొవ్వూరు – టి.వనిత  
2. నిడదవోలు – జి.శ్రీనివాసనాయుడు 
3. ఆచంట –చెరుకువాడ రంగనాథరాజు 
4. పాలకొల్లు – గుణ్ణం నాగబాబు /డా.బాబ్జి
5. నరసాపురం – ముదునూరి ప్రసాదరాజు.
6. భీమవరం – గ్రంధి శ్రీనివాస్.
7. ఉండి – పి.వి.ఎల్.నరసింహరాజు.
8. తణుకు – కారుమూరి వెంకట నాగేశ్వరరావు.
9. తాడేపల్లిగూడెం – కొట్టు సత్యనారాయణ.
10. ఉంగుటూరు –ఉప్పాల వాసుబాబు
11. దెందులూరు – కొటారు అబ్బయ్య చౌదరి 
12.  ఏలూరు – ఆళ్ళ నాని.
13. గోపాలపురం – తలారి వెంకటరావు 
14. పోలవరం – తెల్లం బాలరాజు
15. చింతలపూడి – వి.ఆర్.ఎలీశా 
 

ఈ వార్తలు కూడా చదవండి

తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్: పోటీ చేసే అభ్యర్థులు వీరే....

ఉత్తరాంధ్ర వైసీపీ అభ్యర్థుల జాబితా రెడీ: బరిలో నిలిచేది వీరే.....

కృష్ణా జిల్లా వైసీపీ అభ్యర్థుల ఖరారు : బరిలో నిలిచేది వీరే....

గుంటూరు వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి: అభ్యర్థుల జాబితా ఇదే......

నెల్లూరు అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్: పోటీ చేసే వారి జాబితా రెడీ

చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: పోటీ చేసేది వీరే.....

అనంతపురం వైసీపీ అభ్యర్థుల జాబితా రెడీ: బరిలో నిలిచేది వీరే....

కడప వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: ఫైనల్ అభ్యర్థుల జాబితా ఇదే......

కర్నూలు వైసీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి: బరిలో నిలిచే అభ్యర్థులు వీరే.....

 

click me!