ఈసీపై ఫైట్: ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపేసిన బాబు సర్కార్

By narsimha lodeFirst Published Mar 27, 2019, 4:00 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు జీవోను జారీ చేసింది. కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను బదిలీ చేసింది.
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు జీవోను జారీ చేసింది. కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను బదిలీ చేసింది.

ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎప్సీ రాహుల్‌దేవ్ శర్మలను బదిలీ చేస్తూ సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం పరిధిలోకి రాని ఇంటలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును బదిలీని నిలిపివేస్తూ ఏపీ సర్కార్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికల విధులతో సంబంధం ఉన్న పోలీసుల అధికారులను సీఈసీ పరిధిలోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. అయితే ఇంటలిజెన్స్ డీజీకి  మాత్రం జీవోలో చోటు కల్పించలేదు.ఎన్నికల విధులతో ఇంటలిజెన్స్ డీజీకి సంబంధం లేనందున ఆయన బదిలీ ఉత్తర్వులను రద్దు చేశారు. 
 

సంబంధిత వార్తలు

ఐపీఎస్‌ల బదిలీలు: మరో ధర్మాసనం ముందు రేపు విచారణ

కీలక జీవోను జారీ చేసిన చంద్రబాబు సర్కార్:ఇంటలిజెన్స్‌కి మినహాయింపు

మేమే చెప్పాం, అందుకే ఇంటలిజెన్స్ డీజీ బదిలీ: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

ఎన్టీఆర్‌తో పెట్టుకొంటే ఇందిరా ఏమయ్యారో తెలుసు కదా: కోడెల

నేరస్తుడి ఫిర్యాదుతో ఐపీఎస్‌లను బదిలీ చేస్తారా: చంద్రబాబు ఈసీ‌పై మండిపాటు

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు: ఈసీపై చంద్రబాబు సీరియస్

click me!