ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో రేపు వాదనలు

By narsimha lodeFirst Published Mar 27, 2019, 3:39 PM IST
Highlights

ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై వాదనలను రేపు హైకోర్టు వినే అవకాశం ఉంది.

అమరావతి: ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీపై దాఖలైనపిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై గురువారం నాడు  వాదనలను జరగనున్నాయి.

ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు దాఖలు చేసింది. మంగళవారం రాత్రి ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలను సీఈసీ బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.

ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. లంచ్ మోషన్ పిటిషన్‌ను  విచారణకు హైకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు  ధర్మాసనం విచారణ చేయనుంది. ఈ పిటిషన్‌పై ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలను విన్పించనున్నారు.ఈ కేసులో తాము కూడ ఇంప్లీడ్ అవుతామని వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై  తర్వాత విచారణ చేస్తామని హైకోర్టు అభిప్రాయపడినట్టు సమాచారం.

ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు ఎన్నికల విధులతో సంబంధం లేదని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. అయితే ఈ విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని  ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. 

 

సంబంధిత వార్తలు

కీలక జీవోను జారీ చేసిన చంద్రబాబు సర్కార్:ఇంటలిజెన్స్‌కి మినహాయింపు

మేమే చెప్పాం, అందుకే ఇంటలిజెన్స్ డీజీ బదిలీ: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

ఎన్టీఆర్‌తో పెట్టుకొంటే ఇందిరా ఏమయ్యారో తెలుసు కదా: కోడెల

నేరస్తుడి ఫిర్యాదుతో ఐపీఎస్‌లను బదిలీ చేస్తారా: చంద్రబాబు ఈసీ‌పై మండిపాటు

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు: ఈసీపై చంద్రబాబు సీరియస్

click me!