దిగొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం: ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ

By narsimha lodeFirst Published Mar 29, 2019, 2:36 PM IST
Highlights

ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు  ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

అమరావతి: ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు  ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

సీఈసీ ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు తీర్పు వెలువరించిన నేపథ్యంలో   ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఈ నెల 26వ తేదీన  ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీలను బదిలీ చేస్తూ సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ ఆదేశాలను హైకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.ఈ విషయమై తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. అదే సమయంలో ఏపీ సర్కార్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఎన్నికల విధులకు సంబంధం లేని ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును సీఈసీ పరిధి నుండి తప్పిస్తూ ఏపీ సర్కార్ జీవోను జారీ చేసింది.కానీ, శుక్రవారం నాడు హైకోర్టు  తీర్పు నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావును పోలిస్ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

ఐపీఎస్‌ల బదిలీ: చంద్రబాబు సర్కార్‌కు హైకోర్టులోషాక్

ఐపీఎస్‌ల బదిలీలపై హైకోర్టు తీర్పు రిజర్వ్

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో రేపు వాదనలు

కీలక జీవోను జారీ చేసిన చంద్రబాబు సర్కార్:ఇంటలిజెన్స్‌కి మినహాయింపు

మేమే చెప్పాం, అందుకే ఇంటలిజెన్స్ డీజీ బదిలీ: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

ఎన్టీఆర్‌తో పెట్టుకొంటే ఇందిరా ఏమయ్యారో తెలుసు కదా: కోడెల

నేరస్తుడి ఫిర్యాదుతో ఐపీఎస్‌లను బదిలీ చేస్తారా: చంద్రబాబు ఈసీ‌పై మండిపాటు

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు: ఈసీపై చంద్రబాబు సీరియస్

 

 

click me!