మల్లెల బాబ్జీకి పట్టిన గతే శ్రీనివాస్ కు,శివాజీ కూడా కుట్రదారుడే :తమ్మినేని

By Nagaraju TFirst Published Oct 31, 2018, 5:06 PM IST
Highlights

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసును రాష్ట్ర పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేకపోతున్నారని వైసీపీ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు. జగన్ పై దాడి కుట్రలో సినీనటుడు శివాజీ కూడా భాగస్వామి అని అతనిని ఎందుకు విచారించడంలేదని పోలీసులను నిలదీశారు. 
 

శ్రీకాకుళం : ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసును రాష్ట్ర పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేకపోతున్నారని వైసీపీ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు. జగన్ పై దాడి కుట్రలో సినీనటుడు శివాజీ కూడా భాగస్వామి అని అతనిని ఎందుకు విచారించడంలేదని పోలీసులను నిలదీశారు. 

దాడి జరిగి రోజులు గడుస్తున్నా ఎయిర్‌పోర్టులో సీసీ టీవీ ఫుటేజీని మాత్రం బయటపెట్టడం లేదని విమర్శించారు. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపోతే నిందితుడు శ్రీనివాస్ పరిస్థితి చూస్తే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. గతంలో మల్లెల బాబ్జీకి పట్టిన గతే ఇప్పుడు శ్రీనివాస్‌కు కుడా పడుతుందనే అనుమాలున్నాయని వ్యాఖ్యానించారు. 

తమకు సిట్‌పై నమ్మకం లేదని, ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. హత్యాయత్నం ఘటనపై థర్డ్‌ పార్టీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో చెప్పాలని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. తక్షణమే థర్డ్ పార్టీ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని డిమాండ్ చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

దాడి కేసు విచారణపై హైకోర్టులో జగన్ పిటిషన్....ప్రతివాదిగా చంద్రబాబు జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

 

click me!