జగన్ పైదాడి.. నిందితుడు శ్రీనివాసరావుని చంపేందుకు కుట్ర?

By ramya neerukondaFirst Published Oct 31, 2018, 4:31 PM IST
Highlights

పోలీసు కస్టడిలోని నిందితుడికే రక్షణ లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావుని హత్య చేసి ఈ కేసును క్లోజ్ చేయాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ని చంపేందుకు భారీ కుట్ర జరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వ పెద్దల సహకారంతోనే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తులు వెళ్లాయని ఆరోపించారు. శ్రీనివాసరావును చంపి కేసు క్లోజ్‌ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పోలీసు కస్టడిలోని నిందితుడికే రక్షణ లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

13 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆపరేషన్‌ గరుడ నిజమనడం సిగ్గు చేటని వెంకట్రామి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతుంటే నటుడు శివాజీని ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీలో ఆపరేషన్‌ చంద్రబాబు కొనసాగుతుందంటూ విమర్శించారు. సీఎం, డీజీపీ డైరెక్షన్‌లోనే నిందుతుడు మాట్లాడుతన్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే థర్డ్‌ పార్టీ దర్యాప్తుకు అంగీకరిస్తూ లేఖ రాయలని.. కేసును సుప్రీం కోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

click me!