విజయవాడలో యువతులతో వ్యభిచారం.. వైసీపీ మహిళా నేత అరెస్టు..!

By Sumanth KanukulaFirst Published Nov 23, 2022, 5:05 PM IST
Highlights

విజయవాడ నగరంలో అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న వైసీపీ మహిళా నేతను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఫోన్లో అమ్మాయిలు, యువతుల నగ్న వీడియోలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. 


విజయవాడ నగరంలో అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న వైసీపీ మహిళా నేతను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ పడమటకు చెందిన ఆ మహిళ వస్త్ర దుకాణం నిర్వహిస్తోందని.. అక్కడి వచ్చే యువతులను పరిచయం చేసుకుని, మద్యానికి బానిసలుగా మార్చి, బెదిరింపులకు పాల్పడి వ్యభిచారానికి దించుతుందని సమాచారం. ఈ మేరకు ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది. ఇక, ఆమె ఫోన్లో అమ్మాయిలు, యువతుల నగ్న వీడియోలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. 

వివరాలు.. తన షాపుకు వచ్చిన యువతులకు స్నేహం పెంచుకుంటున్న ఆ మహిళా.. వారిని కిట్టీ పార్టీలకు ఆహ్వానించేది. అక్కడ వారికి శీతలపానీయంలో మత్తుముందు కలిపి.. తర్వాత మద్యం త్రాగే చిత్రాలు, వస్త్రాలు మార్చుకునే సమయంలో నగ్న చిత్రాలు రహస్యంగా తీసి బెదిరింపులకు దిగేది. హై ప్రొఫైల్ వ్యక్తులతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని వారిని బెదిరింపులకు గురిచేస్తూ వ్యభిచార కూపంలోకి నెడుతుంది. గతంలో ఈ మహిళపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో అనేకసార్లు ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు చర్యలు తీసుకోలేదు. 

ఇటీవల ఓ యువతి మహిళ ఒత్తిడిని భరించలేక విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటాను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన ఆయన లోతుగా దర్యాప్తు చేయాలంటూ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలోనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు లో వెల్లడైన వివరాలతో వారు.. మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

click me!