
హైదరాబాద్: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యహరించిన తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను బంట్రోతులు కన్నా హీనంగా వాడుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
రామ్‌గోపాల్ వర్మ ప్రెస్ మీట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడానికి ఆయన చేసిన తప్పేమిటని జనగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిచారు. ఇలాంటి సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని, ఇలాంటి వైఖరి గర్హనీయమని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ ఉదంతంపై ఆయన స్పందించారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి వెళ్లిన రామ్ గోపాల్ వర్మను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దాంతో బెజవాడలో 7 గంటల పాటు హై డ్రామా నడిచింది. చివరకు ఆయనను హైదరాబాదు తిరిగి పంపించారు.
సంబంధిత వార్తలు
7 గంటల హైడ్రామా: బలవంతంగా హైదరాబాదుకు వర్మ తరలింపు
నేను పోలీస్ కస్టడీలో ఉన్నా.. వీడియో షేర్ చేసిన వర్మ!
బెజవాడలో ఆర్జీవీ అరెస్ట్: వర్మకు వైసీపీ నేతల మద్ధతు
అందుకే వర్మను అడ్డుకొన్నాం: విజయవాడ పోలీసులు
బెజవాడలో రామ్‌గోపాల్ వర్మ హైడ్రామా, అదుపులోకి తీసుకొన్న పోలీసులు