తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్

By narsimha lode  |  First Published Aug 21, 2019, 6:52 AM IST

పోలవరం ప్రాజెక్టునిర్మాణ పనుల్లో తమ నిర్ణయాన్ని ఏపీ సర్కార్ సమర్ధించుకొంది. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్నిపీపీఏకు లేఖ రాసింది.


అమరావతి:పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు  రివర్స్ టెండరింగ్ ఆహ్వానించడంపై ఏపీ ప్రభుత్వం తన వాదనను విన్పిస్తోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) వాదనలను ఏపీ సర్కార్ తోసిపుచ్చుతోంది. ఏ కారణాలతో రివర్స్ టెండర్లకు వెళ్లాల్సి వచ్చిందో పీపీఏ సీఈఓకు ఏపీ సర్కార్ లేఖ రాసింది. 

రివర్స్ టెండర్ల విషయంలో పోలవరం అథారిటీ ఇచ్చిన సూచనలను బేఖాతరు చేస్తూ ఈ నెల 17వ తేదీన కొత్త టెండర్లకు ఏపీ సర్కార్ ఆహ్వానించింది. ఈ విషయమై కేంద్రం కూడ సీరియస్ గా స్పందించింది. రివర్స్ టెండరింగ్ పనుల టెండర్లతో పాటు పీపీఏ సమావేశం వివరాలకు సంబంధించి పూర్తి నివేదికలను ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది.

Latest Videos

ఈ నెల 13వ తేదీన పీపీఏ సమావేశం హైద్రాబాద్ లో జరిగింది. రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కానుందని సమావేశం అభిప్రాయపడింది. అంతేకాదు ప్రాజెక్టు ఆలస్యం కానుందని కూడ తేల్చింది.

ఈ మేరకు పీపీఏ సీఈఓ ఈ నెల 16వ తేదీన ఏపీ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. ఈ లేఖ అందిన మరునాడే ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండర్లకు ఆహ్వానిస్తూ నోటీపికేషన్ జారీ చేసింది.

పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండర్లను ఆహ్వానించడంపై నివేదిక ఇవ్వాలని పీపీఏ సీఈఓ ఆర్ కె జైన్ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.అయితే ఏపీ ప్రభుత్వం కూడ తన వాదనలను విన్పించాలని నిర్ణయం తీసుకొంది.

పీపీఏ సీఈఓ ఆర్ కె జైన్ కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. రెండు పేజీల లేఖలో తన వాదనను వినిపించింది. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యం కావని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ విధానం కారణంగా ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా ఉంటుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. పీపీఏ లేవనెత్తిన అంశాలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనుల విషయంలో నవయుగ కంపెనీ ఈపీసీ ఒప్పందాలను తుంగలో తొక్కిందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.ఈపీసీ నిబంధనలను ఉల్లంఘించిన కాంట్రాక్టు సంస్థను తొలగించే అధికారం ఉందని ప్రభుత్వం వాదించింది.

ఈ లేఖలో 19 పాయింట్లను ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది. ప్రస్తుతం గోదావరి నదిలో వరద వస్తోంది.ఈ కారణంగా నవంబర్ మాసం వరకు పనులు చేయడానికి సాధ్యం కాదని ఆ లేఖలో ఏపీ సర్కార్ పీపీఏ కు స్పష్టం చేసింది.

పోలవరం నిర్మాణం పనులను నవయుగ కంపెనీకి ఇచ్చిన జల విద్యుత్ ప్రాజెక్టు పనులను రద్దు చేయడంతో పాటు రివర్స్ టెండర్లకు ఏపీ సర్కార్ పిలుపు ఇవ్వడం కొంత వివాదాస్పదమైంది. 

ఈ విషయంలో ఏపీ సర్కార్ నిర్ణయాన్ని నిరసిస్తూ నవయుగ కంపెనీ మంగళవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై ప్రభుత్వం, నవయుగ కంపెనీ వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది.రివర్స్ టెండరింగ్ విషయంలో కనీసం కేంద్రం సూచనలు వచ్చే వరకైనా ఆగాలని పీపీఏ సీఈఓ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. కానీ,వాటిని ఏపీ సర్కార్ పట్టించుకోలేదు.  

సంబంధిత వార్తలు

పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

జైన్ షాక్: జగన్‌ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు

click me!