అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డికి బెయిల్: చంద్రబాబుపై దాడి కేసులోనూ.....

By Nagaraju penumalaFirst Published Aug 20, 2019, 8:25 PM IST
Highlights

అంతర్జాతీయ స్మగ్లర్ కాకముందు కూడా గంగిరెడ్డిపై నేరచరిత్ర ఉంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో జరిగిన బ్లాస్ట్ కేసులోనూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు గంగిరెడ్డి. ఒక పారిశ్రామిక వేత్త హత్యలోనూ గంగిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
 

తిరుపతి: అంతర్జాతీయ స్మగ్లర్‌ గంగిరెడ్డికి బెయిల్ మంజూరైంది. గాజుల మండ్యం కేసులో కొల్లం గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తిరుపతి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  తిరుపతి కోర్టు ఆదేశాలతో మంగళవారం సాయంత్రం కొల్లం గంగిరెడ్డి తిరుపతి జిల్లా కేంద్రకారాగారం నుంచి విడుదలయ్యాడు. 

ఇకపోతే కడప జిల్లాకు చెందిన కొల్లం గంగిరెడ్డి 26 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులతోపాటు మరో 16 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. మెుత్తం కొల్లం గంగిరెడ్డిపై 42 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిలోనూ తిరుపతి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇకపోతే 2014 ఎన్నికల అఫిడవిట్ లో గంగిరెడ్డి కేసుల చిట్టా బట్టబయలైంది. అప్పగి వరకు ఎంతో చాకచక్యంగా స్మగ్లింగ్ లు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న అతగాడి నేరచరిత్ర ఒక్కసారిగా బట్టబయలైంది. 

అంతర్జాతీయ స్మగ్లర్ కాకముందు కూడా గంగిరెడ్డిపై నేరచరిత్ర ఉంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో జరిగిన బ్లాస్ట్ కేసులోనూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు గంగిరెడ్డి. ఒక పారిశ్రామిక వేత్త హత్యలోనూ గంగిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

గంగిరెడ్డిపై కేసులు నమోదు కావడంతో తప్పించుకు తిరిగాడు. నకిలీ పాస్ పోర్టులతో వివిధ దేశాల్లో తలదాచుకున్నాడు. దాంతో ఇంటర్ పోల్ అధికారులు గంగిరెడ్డి ఫోటోను ఇంటర్నెట్ లో పెట్టారు. అయితే మలేసియాలో గంగిరెడ్డి తలదాచుకున్న విషయం తెలుసుకున్న ఇంటర్ పోల్ అధికారులు అతడిని భారత్ కు తీసుకువచ్చారు. 

2015లో ఏపీ పోలీసులు గంగిరెడ్డిని అదుపులో తీసుకుని కడప జిల్లా ప్రొద్దుటూరులో హాజరుపరిచారు. ఏడాదిపాటు పీడీ యాక్టు నమోదు చేశారు పోలీసులు. దాంతో 2015 నుంచి కడప కేంద్ర కారాగారంలో ఉన్నాడు గంగిరెడ్డి. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గాజుల మండ్యం పోలీస్ స్టేషన్లో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా కోర్టులో ఉన్నాడు.  

ఇకపోతే 2014 మే 21న రేణిగుంట మండలం యోగానంద కళాశాల సమీపం పాపానాయుడుపేట జంక్షన్‌ వద్ద కడప జిల్లా రైల్వేకోడూరు మార్గంగుండా లారీలో 31 ఎర్రచందనం దుంగలు (967 కిలోలు) తరలిస్తుండగా గాజులమండ్యం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ కేసులో గంగిరెడ్డిపై కేసు నెంబరు 61/2014 ఐపీసీ 307, 353, 379, ఫారెస్ట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇకపోతే ఏడాదిపాటు పీడీ యాక్టు ముగియడంతో కొల్లం గంగిరెడ్డి బెయిల్ పై విడుదలయ్యాడు. 
 

click me!