నా మాటలను వక్రీకరించారు: వివేకా హత్యపై అవినాష్

Published : Mar 18, 2019, 04:00 PM IST
నా మాటలను వక్రీకరించారు: వివేకా హత్యపై అవినాష్

సారాంశం

తన మాటలను స్థానిక సీఐ వక్రీకరించారని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. సీఐపై తాను  ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఆయన వివరించారు.   

కడప: తన మాటలను స్థానిక సీఐ వక్రీకరించారని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. సీఐపై తాను  ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఆయన వివరించారు. 

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు విషయమై  సోమవారం నాడు పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు విచారించారు. విచారణ తర్వాత  ఆయన మీడియాతో మాట్లాడారు.

పోలీసులు విచారణకు పిలిస్తే తాను వచ్చినట్టు ఆయన వివరించారు.పోలీసులు ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానన్నారు. విచారణకు రమ్మంటే వచ్చినట్టుగా ఆయన చెప్పారు. స్థానిక సీఐ తన మాటలను వక్రీకరిస్తున్నట్టుగా అవినాష్ రెడ్డి చెప్పారు.

సీఐ తప్పుడు సమాచారం ఇచ్చాడన్నారు. గుండెపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయారని తాను సీఐకు చెప్పలేదన్నారు. గుండెపోటుతో వివేకానందరెడ్డి చనిపోయారా అని సీఐ తనను ప్రశ్నించారని ఆయన వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్య: డీఎస్పీ ఆఫీస్‌కు అవినాష్ రెడ్డి

టీడీపీలోకి వచ్చేందుకు పరమేశ్వర్ రెడ్డి రెడీ: వివేకా హత్యపై బీటెక్ రవి ఆసక్తికర వ్యాఖ్యలు

వైఎస్ వివేకా హత్య: ఇంటి గుట్టుపై పరమేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రాణాలిచ్చేవాడినే కానీ, తీసేవాడిని కాదు: వైఎస్ వివేకా హత్యపై పరమేశ్వర్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య: అదృశ్యం కాలేదన్న పరమేశ్వర్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య: పరమేశ్వర్ రెడ్డి కోసం సిట్ గాలింపు

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu