ఎంపీగా పోటీ చేస్తున్నా. కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

Published : Mar 18, 2019, 03:33 PM IST
ఎంపీగా పోటీ చేస్తున్నా. కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

సారాంశం

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మొన్నటి వరకు ఏపీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని.. ముఖ్యమంత్రి కూడా అవుతానంటూ కేఏపాల్ మాట్లాడిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా తాను ఎంపీగా పోటీచేయనున్నట్లు ప్రకటించారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేసిన పాస్టర్ల సదస్సులో కేఏపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ పై స్పందించారు. తాను ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

తమ పార్టీ ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. కచ్చితంగా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీలోకి పవన్ రావాల్సిందిగా గతంలో పాల్ ఆహ్వానించిన సంగతి విదితమే.

PREV
click me!

Recommended Stories

Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ | Asianet News Telugu
నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu