‘‘నువ్వు ఫినిష్’’ అని బాబు అన్నారు.. వైఎస్ అదేరోజు చనిపోయారు: రోజా

By sivanagaprasad kodatiFirst Published Nov 1, 2018, 2:07 PM IST
Highlights

‘‘ నాతో పెట్టుకుంటే నువ్వు ఫినిష్’’ అని చంద్రబాబు... వైఎస్‌తో అన్న రోజే ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని రోజా ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదల కోసం చంద్రబాబు ఎవరినైనా అడ్డు తొలగించుకుంటారని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌పై దాడిపై గవర్నర్ నరసింహన్‌కు వైసీపీ నేతలు ఇవాళ ఫిర్యాదు చేసిన వారు ..ఈ కేసును థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం వైసీపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన రోజా.. కేంద్ర విచారణ సంస్థలు దర్యాప్తు ప్రారంభించగానే చంద్రబాబు కేంద్రం కాళ్లు పెట్టుకుంటారని రోజా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థాయున్న జగన్‌పై దాడి జరిగితే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం, హోంమంత్రి, డీజీపీ ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించారని రోజా ఆరోపించారు.

ప్రతిపక్షనేతపై దాడి జరగాలంటే చాలా పెద్ద తలకాయల హస్తం ఉండి ఉండాలని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ‘‘ నాతో పెట్టుకుంటే నువ్వు ఫినిష్’’ అని చంద్రబాబు... వైఎస్‌తో అన్న రోజే ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని రోజా ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదల కోసం చంద్రబాబు ఎవరినైనా అడ్డు తొలగించుకుంటారని వ్యాఖ్యానించారు.

రాజకీయంగా అడ్డొచ్చిన కుటుంబసభ్యులనే పక్కకు తప్పించిన చరిత్ర బాబుదని రోజా ఎద్దేవా చేశారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే చంద్రబాబు ఈ దాడికి కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. జనవరిలోనే శ్రీనివాస్ చేతికి కత్తి అందిందని.. రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరి పేరును నివేదికలో చేర్చలేదన్నారు.

ఆయన లోకేశ్‌, గంటా , నారాయణలకు అత్యంత సన్నిహితుడైనందునే పోలీసులు హర్షవర్థన్ పేరును పక్కనబెట్టారని ఆయన కాల్ డేటా తీయాలని రోజా డిమాండ్ చేశారు. చేతిలో సినిమాల్లేని శివాజీ చేత ఆపరేషన్ గరుడ అని డ్రామాలు ఆడిస్తున్నారన్నారు.

అన్ని వివరాలు తెలిసిన శివాజీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రోజా ప్రశ్నించారు. శివాజీకి దమ్ము, ధైర్యం లేదని అందుకే అమెరికాలో దొక్కొన్నారని ఆమె ఎద్దేవా చేశారు. జగన్‌కు భద్రత పెంచాలని లేదంటే తామే ఆయన్ను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు తదితరులు ఉన్నారు. 

More News:

జగన్‌పై దాడి: నవంబర్ 6న విచారణ జరపనున్న హైకోర్టు

జగన్ పై దాడి.. కీలకంగా మారనున్న జగన్ షర్ట్

మళ్లీ అనారోగ్యానికి గురైన శ్రీనివాస్...ఎయిర్ పోర్టు పీఎస్‌లోనే వైద్యం

జగన్ కి ఫోన్ చేద్దామనుకున్నా, అందుకే చెయ్యలేదు: చంద్రబాబు

మిస్డ్ కాల్ వస్తే ఫోన్ చేశా: జగన్‌‌పై దాడి కేసులో గుంటూరు మహిళ

దాడి జరిగిన తర్వాత జగన్ విశాఖలో ఎందుకు ఆగలేదంటే......

జగన్ స్టేట్‌మెంట్‌కోసం మరోసారి ఏపీ పోలీసుల యత్నం

సిట్ అధికారులను శ్రీనివాస్ తల్లిదండ్రులు ఏం కోరారంటే...

చంద్రబాబు ప్రతివాదిగా కోర్టులో పిటిషన్: జగన్ వాదన ఇదీ

జగన్ పైదాడి.. నిందితుడు శ్రీనివాసరావుని చంపేందుకు కుట్ర?

నవంబర్ 6న దాడిపై ప్రజలకు వివరణ ఇవ్వనున్న జగన్

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

click me!