వంగవీటి రాధా ఆగ్రహం: బుజ్జగింపులు, ఆ రోజు ఏం జరిగిందంటే...

By pratap reddyFirst Published Sep 17, 2018, 6:22 PM IST
Highlights

విజయవాడ సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు ఖరారైందని ప్రచారం జరగడంతో ఆగ్రహంతో ఉన్న వంగవీటి రాధాను బుజ్జగించడానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రంగంలోకి దిగారు. రాధాను బుజ్జగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

విజయవాడ: విజయవాడ సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు ఖరారైందని ప్రచారం జరగడంతో ఆగ్రహంతో ఉన్న వంగవీటి రాధాను బుజ్జగించడానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రంగంలోకి దిగారు. రాధాను బుజ్జగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు వైసిపి అధిష్టానం పెద్దలు ఫోన్లు చేశారు. 

విజయవాడ సెంట్రల్ సీటు తనకు దక్కదని ప్రచారం జరగడంతో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులతో వంగవీటి రాధా సమావేశమయ్యారు. దీంతో పెద్ద ఎత్తున ఆయన ఇంటికి అనుచరులు చేరుకున్నారు. కానీ ఆయనను మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీకి దింపాలని వైసిపి అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
 
ఈ వ్యవహారంపై రాధాతో పార్టీ అధిష్ఠానం సంప్రదింపులు జరుపుతోంది. తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దని కోరుతూ ఆయనకు ముఖ్య నేతలు ఫోన్‌లో సలహా ఇచ్చారు. ఓ వైపు యలమంచిలి రవి, మరో వైపు కొడాలి నాని ఆయనతో చర్చలు జరుపుతున్నారు.

మచిలీపట్నం, విజయవాడ ఈస్ట్, అవనిగడ్డ ప్రతిపాదనలపై రాధా మనస్తాపంతో ఉన్నట్లు తెలిసింది. సెంట్రల్ సీటే కావాలని ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే అధిష్ఠానం స్పష్టమైన ప్రకటన చేసే వరకూ రాధా అనుచరులు సంయమనం పాటించాలని వైసిపి నేతలు కోరుతున్నారు.
 
యలమంచిలి రవి వంగవీటి రాధాతో భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు చర్చించారు. ఆ తర్వాత రంగా అనుచరులు, వైసీపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. 

తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, లేనిది ఉన్నట్లు ఊహించుకుని ఆవేశపడటం వల్ల ఉపయోగమేమీ లేదని,  సంయమనం పాటించాలని ఆయన రంగా, రాధా అనుచరులకు విజ్ఞప్తి చేశారు. అధిష్ఠానం నుంచి ఎలా ప్రకటన రాలేదని, పత్రికల్లో వార్తలు చూసి అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 

ఎమ్మెల్యే, ఎంపీల టిక్కెట్ల ప్రస్తావనే పార్టీలో ఇంత వరకు రాలేదని ఆయన అన్నారు. అవన్నీ అబద్ధాలేనని అన్నారు. అధిష్ఠానం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఆదేశాలు రాలేదని అన్నారు. ఒకవేళ ఆదేశాలుంటే నిర్ణయాలు తీసుకోవచ్చునని, కానీ ఆదేశాలే లేనప్పుడు తొందరపడడం సరి కాదని అన్నారు.
 
ఆదివారం రోజున వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఫంక్షన్ కోసం జిల్లాకు వచ్చారని, రాధాతో కలిసి బొత్స ఫంక్షన్‌కు వెళ్లారని, ఆ తర్వాత బొత్సను ఆఫీసులో దింపేసి రాధా నేరుగా ఇంటికెళ్లారని ఆయన చెప్పారు. అంతకుమించి ఆదివారం నాడు ఏమీ జరగలేదని, అక్కడేమీ జరగలేదని వివరించారు. అంతా జరిగిపోయిందని వార్తల్లో రావడం మూలాన రంగా, రాధా అనుచరులు ఆందోళన చెందారని అన్నారు.

ఈ వార్తాకథనాలు చదవండి

వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్‌లోకి టీడీపీ?

వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు

వైసీపీలో చిచ్చు: రంగా విగ్రహం వద్ద అభిమానుల ధర్నా

వైసీపీలో చిచ్చు: ఆత్మాహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు, ఉద్రిక్తత

జనసేనలోకి వంగవీటి శ్రీనివాస ప్రసాద్..?

click me!