ఆపరేషన్ గరుడ పేరుతో హీరో శివాజీ డ్రామాలు

Published : Sep 17, 2018, 05:24 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
ఆపరేషన్ గరుడ పేరుతో  హీరో శివాజీ డ్రామాలు

సారాంశం

బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన విషయంలో ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ పై తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో లబ్ది పొందేందుకే టీడీపీ నోటీసుల డ్రామా ఆడుతోందని విమర్శించారు. 

అమరావతి: బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన విషయంలో ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ పై తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో లబ్ది పొందేందుకే టీడీపీ నోటీసుల డ్రామా ఆడుతోందని విమర్శించారు. 

రూ.500తో పోయే కేసును పట్టుకొని ఏదో జరిగిపోయినట్లు టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని, ఇటువంటి ప్రచారం వల్ల ఎలాంటి సానుభూతి రాదన్నారు. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదని విష్ణుకుమార్‌ రాజు విమర్శించారు.

గతంలోనే బాబ్లీకి సంబంధించి నోటీసులు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో అందుకున్నట్లు సమాచారం ఉందన్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అదే నోటీసులు వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డికి వస్తే మాత్రం కోర్టులపై గౌరవం ఉందని చంద్రబాబు మాట్లాడేవారని ఎద్దేవ చేశారు. చంద్రబాబుకు కోర్టు నుంచి నోటీసులు వస్తే ప్రధాని నరేంద్ర మోదీ చేయించారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

మరోవైపు హీరో శివాజీతో టీడీపీ డ్రామాలు ఆడిస్తోందని మండిపడ్డారు. శివాజీతో టీడీపీ ఆడిస్తున్నడ్రామాలు ప్రజలకు తెలియదనుకోవడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. అరెస్టు వారెంట్‌ విషయం వారం రోజుల ముందు శివాజీకి ఎలా తెలుసనని ప్రశ్నించారు. టీడీపీ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తోందని వారి మాటలను నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని వివరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఆపరేషన్ గరుడా..పెరుగు వడా అంటున్న బీజేపీ నేత

బాబుకు మరో రెండు నోటీసులు: బాంబు పేల్చిన హీరో శివాజీ

ఆపరేషన్ గరుడ: నటుడు శివాజీకి మాజీమంత్రి కౌంటర్

 

PREV
click me!

Recommended Stories

AP Municipal Elections 2026 : టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు వీళ్లే...
Kotamreddy Sridhar Reddy Serious Warning to YS Jagan | Punganur Incident | TDP Vs YCP