సీబీఐకి ఆ అధికారం లేదు.. ఛార్జిషీట్ ను హైకోర్టులో స‌వాలు చేసిన ఐఏఎస్‌ వై.శ్రీలక్ష్మి

By Mahesh RajamoniFirst Published Dec 25, 2021, 9:49 AM IST
Highlights

HYDERABAD: సీబీఐకి సొంతంగా ద‌ర్యాప్తు చేసే అధికారం లేద‌నీ, త‌న‌పై సీబీఐ మోపిన అదనపు అభియోగాలను స‌వాలు చేస్తూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐఏఎస్ ఆఫీస‌ర్ వై.శ్రీ‌ల‌క్ష్మీ తెలంగాణ హైకోర్టులో వాద‌న‌లు వినిపించారు. పెన్నా సిమెంట్స్‌కు మైనింగ్ లైసెన్స్ కేటాయింపునకు సంబంధించి ఆమెపై నమోదైన కేసును కొట్టివేయాలని ఐఏఎస్ అధికారి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. 
 

HYDERABAD: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి సొంతంగా అదనపు చార్జిషీట్లు దాఖలు చేసే అధికారం లేదని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్విడ్‌ ప్రోకో కేసుల్లో నిందితులుగా ఉన్న ఐఏఎస్‌ అధికారిణి వై.శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. త‌నపై మోపిన అద‌న‌పు అభియోగాల‌ను ఆమె కోర్టులో స‌వాలు చేశారు. వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేసుల్లో హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టి అది పూర్తయిందంటూ అభియోగపత్రం దాఖలు చేసింది. అయితే, మళ్లీ దర్యాప్తు చేసి అదనపు అభియోగపత్రం దాఖలు చేసే అధికారం Central Bureau of Investigation (CBI)కి  లేదని ఏపీ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. సీబీఐకి సొంతంగా దర్యాప్తు చేపట్టే అధికారం లేదని తెలిపారు. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో పెన్నా సిమెంట్స్‌కు భూముల కేటాయింపులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ శ్రీలక్ష్మి పిటిష‌న్ దాఖ‌లు  చేశారు. ఈ  పిటిషన్‌పై న్యాయ‌మూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు. శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది ఈ మేరకు వాదనలు వినిపించారు.

Also Read: ఏకంగా నకిలీ ఆధార్ లు త‌యారీ.. 8 మంది కేటుగాళ్ల అరెస్ట్ !

అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్నా సిమెంట్స్‌కు మైనింగ్ లైసెన్స్ కేటాయింపునకు సంబంధించి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు శుక్ర‌వారం నాడు విచారించింది.  ఆమె త‌ర‌ఫు న్యాయవాది రాఘవాచార్యులు కోర్టు ముందు వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాల మేర‌కే క్విడ్ ప్రోకో కేసులపై సీబీఐ విచారణ ప్రారంభించిందని ఆయన వాదించారు. అయితే 2012లో పెన్నా సిమెంట్స్‌ ఇష్యూలో మాత్రమే ఛార్జిషీట్‌ దాఖలు చేసి విచారణ పూర్తయిందని మెమో కూడా దాఖలు చేసింద‌ని తెలిపారు. అయితే, 2016లో సీబీఐ మరో ఏడుగురిని నిందితులుగా చేర్చుతూ ఈ అంశానికి సంబంధించి అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఆ ఏడుగురిలో ఒకరు శ్రీలక్ష్మి. "ఎలా, ఏ ప్రాతిపదికన Central Bureau of Investigation (CBI)  తనంతట తానుగా తదుపరి విచారణ జరిపి అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేయగలదు" అని న్యాయవాది ప్రశ్నించారు. ఈ పిటిష‌న్‌పై త‌దుప‌రి విచార‌ణ సోమ‌వారానికి హైకోర్టు వాయిదా వేసింది. 

Also Read: మోక్షం అంటూ... మూఢత్వంతో కుటుంబాన్ని బలితీసుకున్న వ్య‌క్తి

జగన్ మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో కేసులకు సంబంధించి నమోదైన పదకొండు కేసుల్లో ఒకటైన పెన్నా సిమెంట్స్ కేసులో 2016లో సీబీఐ దాఖలు చేసిన అదనపు ఛార్జిషీట్‌లో శ్రీలక్ష్మిని నిందితురాలిగా పేర్కొన్నారు. ఈ ఛార్జిషీట్ లో ఆమెను  ఆమె 15వ నిందితురాలిగా పేర్కొన్నారు. దివంగ‌త నేత‌, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  ఆంధ్ర‌ప్ర‌దేశ్ గనులు, పరిశ్రమల శాఖ కార్యదర్శి వై.శ్రీలక్ష్మి విధులు నిర్వ‌హించారు.  అయితే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన పెన్నా సిమెంట్స్‌కు మైనింగ్‌ లైసెన్స్‌లు మంజూరు చేయడంలో నేరపూరిత కుట్రలో భాగమేనని సీబీఐ అదనపు చార్జిషీట్‌లో పేర్కొంది. ఆమె  రాష్ట్ర గనులు, ప‌రిశ్ర‌మ‌ల‌ శాఖ కార్యదర్శిగా ప్రభుత్వ పదవిలో ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా పెన్నా సిమెంట్స్‌కు 304 హెక్టార్ల భూమిని సున్నపురాయి తవ్వకాలకు అనుమ‌తి ఇచ్చారని ఆరోపించారు. అదే సమయంలో, మైనింగ్ లీజు మంజూరు చేయాలని అల్ట్రా టెక్ సిమెంట్ చేసిన దరఖాస్తును ఆమె పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు.

Also Read: Tax raids: వ్యాపారి ఇంట్లో గుట్ట‌ల కొద్ది నోట్ల క‌ట్ట‌లు.. స‌మాజ్‌వాదీ పార్టీపై విమ‌ర్శ‌లు !

click me!