
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్‌లో (Visakhapatnam Steel Plant) శనివారం అగ్ని ప్రమాదం (fire accident) చోటుచేసుకుంది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్ -2 లో పైపుకు రంద్రం పడటంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో రెండు లారీలు దగ్ధమయ్యాయి. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదం వల్ల భారీగా రూ. 50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.