కిడారి, సోమ హత్య: ఆపరేషన్‌లో పాల్గొన్న మహిళా నక్సలైట్ కాల్చివేత

By narsimha lodeFirst Published Oct 12, 2018, 2:13 PM IST
Highlights

ఆంధ్రా ఓడిశా బోర్డర్‌లో శుక్రవారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మీనా అనే మహిళ మావోయిస్టు మృతి చెందింది

విశాఖపట్టణం: ఆంధ్రా ఓడిశా బోర్డర్‌లో శుక్రవారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మీనా అనే మహిళ మావోయిస్టు మృతి చెందింది.మీనా  మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు గాజర్ల రవి భార్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.

సెప్టెంబర్ 23వ తేదీన  అరకు నియోజకవర్గంలోని లివిటిపుట్టువద్ద అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలో మీనా కీలకంగా పాల్గొన్నట్టు సమాచారం.

శుక్రవారం నాడు  ఆంధ్రా ఓడిశా సరిహద్దులో శుక్రవారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్ లో మీనా మృతి చెందింది. మీనా మృతి చెందితే  జయంతి, గీత,రాధిక,  రాజశేఖర్ అనే మావోయిస్టులను  పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.

మృతి చెందిన మహిళ మావోయిస్టు మీనా.... మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి భార్యగా పోలీసులు చెబుతున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిగిన సమయంలో గాజర్ల రవి  అడవుల నుండి బయటకు వచ్చారు. చర్చలు ముగిసిన తర్వాత రవి తిరిగి అడవుల్లోకి వెళ్లాడు.  పలు ఎన్‌కౌంటర్ల నుండి గాజర్ల రవి పలుమార్లు తప్పించుకొన్నాడని  పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

 

సంబంధిత వార్తలు

తప్పు చేశారు శిక్షించాం.. కిడారి హత్యపై మావోల లేఖ..?

కిడారి,సోమ హత్యలో నా ప్రమేయం ఉంటే ఏ శిక్షకైనా సిద్ధం

కిడారి హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

మావోల నెక్ట్స్ టార్గెట్..గిడ్డి ఈశ్వరి.. భారీ భద్రత నడుమ పర్యటన

కిడారి హత్య: కారులో రూ.3 కోట్లు ఏమయ్యాయి?

ఎమ్మెల్యే హత్య: కిడారిని ట్రాప్ చేసి.. బంధువులే నమ్మకద్రోహం

కిడారి హత్య: పోలీసుల అదుపులో మాజీ ఎంపీటీసీ సుబ్బారావు

కిడారి హత్య: టీడీపీ నేత హస్తం, రెండోసారి మావోల ప్లాన్ సక్సెస్

అరకు ఘటన: ఆ ఇద్దరే మావోలకు సమాచారమిచ్చారా?

click me!