పవన్.. మేము నక్సలైట్లం కాదు..మంత్రి జవహర్

Published : Oct 12, 2018, 01:14 PM IST
పవన్.. మేము నక్సలైట్లం కాదు..మంత్రి జవహర్

సారాంశం

వ్యవస్థను మార్చ డానికి అతివాదులు వస్తారని, తీవ్రవాదులు వస్తారంటూ తుపాకులు పట్టుకోడండంటూ యువతకు ఎటువంటి సందేశం ఇస్తున్నావని  మంత్రి మండిపడ్డారు.

వ్యవస్థలో ఒకేసారి మార్పు తీసుకురావడానికి తామేమీ నక్సలైట్లం కాదని ఏపీ మంత్రి జవహర్ అభిప్రాయపడ్డారు. కొవ్వూరు పట్టణంలోని 4వ వార్డులోని గురువారం అపోలో సహకారంతో సీఎం ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ కొంతమంది పగటి వేషగాళ్లు ఆసుపత్రిని రిఫరల్‌ ఆసుపత్రిగా చేశామని విమర్శిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో 1,236 కోట్లతో చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అన్నారు.

పవన్‌ నీకు తగునా.. వ్యవస్థను మార్చ డానికి అతివాదులు వస్తారని, తీవ్రవాదులు వస్తారంటూ తుపాకులు పట్టుకోడండంటూ యువతకు ఎటువంటి సందేశం ఇస్తున్నావని  మంత్రి మండిపడ్డారు.

వ్యవస్థను మార్చడానికి అతి వాదులు, తీవ్రవాదులు వస్తారని తుపాకులు పట్టుకోండని చెబుతున్నారన్నారని తుపాకుల ద్వారా ఏదీ సాధ్యం కాదన్నారు.ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్న వ్యక్తులుగా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్