జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

By Nagaraju penumalaFirst Published Feb 2, 2019, 2:50 PM IST
Highlights


అయినా వీరి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న విషయాన్ని జయరామ్ చౌదరి గమనించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత  రాకేష్‌ ని జయరామ్ కలిసి శిఖాచౌదరిని వదిలెయ్యాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో జయరామ్ రాకేష్ కు డబ్బు ఆశచూపినట్లు తెలుస్తోంది. 
 


హైదరాబాద్ : కృష్ణ జిల్లాలో సంచలనం సృష్టించిన ఎన్ఆర్ఐ, ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ చౌదరి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జయరామ్ చౌదరిపై విషప్రయోగం జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.  

జయరామ్‌ మేనకోడలు శిఖాచౌదరి ఈ హత్యలో ప్రధాన పాత్ర పోషించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. జయరామ్ హత్యకు కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల వ్యవహారమై హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 

శిఖాచౌదరి ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని ప్రచారం జరుగుతోంది. జయరామ్ మేనకోడలు శిఖాచౌదరి, రాకేష్ అనే యువకుడిని ప్రేమించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వారి పెళ్లికి శిఖాచౌదరి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.  

అయినా వీరి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న విషయాన్ని జయరామ్ చౌదరి గమనించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత  రాకేష్‌ ని జయరామ్ కలిసి శిఖాచౌదరిని వదిలెయ్యాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో జయరామ్ రాకేష్ కు డబ్బు ఆశచూపినట్లు తెలుస్తోంది. 

అందులో భాగంగా శిఖాచౌదరిని వదిలేస్తే రూ3.5 కోట్లు ఇస్తానని రాకేష్ కి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రాకేష్ శిఖాచౌదరికి దూరంగా ఉంటున్నాడు. అయితే జయరామ్ ఇస్తానన్న సొమ్ము ఇవ్వకపోవడంతో మళ్లీ ఇద్దరు కలిసినట్లు తెలుస్తోంది. 

డబ్బు ఇవ్వకపోవడంతోపాటు తమని విడదీసేందుకు జయరామ్ కుట్ర పన్నారన్న అనుమానంతో ఇద్దరూ కలిసి హత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. హత్యకు ముందు జయరామ్ చౌదరి ఇంటికి శిఖాచౌదరి, రాకేష్ ఇద్దరూ వెళ్లినట్లు వాచ్ మన్ చెప్తున్నారు. 

చనిపోయిన రోజు జయరామ్‌ ఇంటికి శిఖాచౌదరి వచ్చినట్లు వాచ్ మన్ చెప్తున్నారు. వాచ్‌మెన్‌ను బెదిరించి ఇంటితాళాలు తీసుకొని ఇంట్లోకి వెళ్లిందని పోలీసుల విచారణలో వెల్లడించారు. శిఖాచౌదరి కంగారుగా ఉందని ఆమెతోపాటు రాకేష్ ఉన్నట్లు వాచ్ మన్ చెప్తున్నాడు. 

జయరామ్ హత్య జరిగిన తర్వాత శిఖాచౌదరి మిస్ అవ్వడం 36 గంటలు తర్వాత ఆమె ఆచూకి లభించడం చూస్తుంటే ఆమె పాత్ర ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉన్నారు. 

జగ్గయ్యపేటలోని ఓ గెస్ట్ హౌస్ లో ఆమెను విచారిస్తున్నారు. మరోవైపు జయరామ్ చౌదరి మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించారు. భార్య పిల్లలు వచ్చిన వెంటనే అంత్యక్రియలు పూర్తి చెయ్యనున్నారు.    

ఈ వాార్తలు కూడా చదవండి

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు

 

click me!