అన్ని ప్రముఖ వార్తాపత్రికల్లోని వార్తాకథనాల సమాహారం టాప్ స్టోరీస్. తెలంగాణలో ప్రధాని మోదీ, మంత్రి కేటీఆర్ ప్రచారం... ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, సాధికారత సభలు... ఇలాంటి టాప్ టెన్ వార్తలు మీ కోసం..
తెలంగాణలో స్కీములన్నీ స్కాములే...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు మరో మూడునాలుగు రోజుల్లో ముగియనుండటంతో బిజెపి ప్రచార జోరు పెంచింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ నిన్న(శనివారం) రంగంలోకి దిగి ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీచేస్తున్న కామారెడ్డిలో బిజెపి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా... బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే అది బిఆర్ఎస్ కు వేసినట్లే... సీఎం కేసీఆర్ లో కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తోందని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ తోనే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమయ్యింది... ఆ పార్టీలో గతంలో పొత్తు పెట్టుకున్నారు... వారి హయాంలోనే కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ అదిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చారు... కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై కాంగ్రెస్ అవిశ్వాసం పెడితే బిఆర్ఎస్ మద్దతిచ్చింది... కేసీఆర్ కాంగ్రెస్ ఒకటే అనడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలని ప్రధాని అన్నారు. ఇలా కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగాన్ని ప్రధాన వార్తగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక.
Narendra Modi..ఒకే నాణెనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండు ముఖాలు: తుక్కుగూడలో మోడీ
చట్టంగా 6 గ్యారంటీలు... రాహుల్ గాంధీ
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదట 6 గ్యారంటీల అమలుకే చర్యలు తీసుకుంటామని... తొలి కేబినెట్ బేటీలోనే వీటిని చట్టరూపంలోకి తీసుకువస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. అలాగే ఈ పదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ సంపాదించిన అవినీతి సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పంచిపెడుతుందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ను ఓడిస్తే కేంద్రంలో మోదీని ఓడించవచ్చు... కాబట్టి ఇక్కడి ప్రజలు ఆలోచించి ఓటేయాలని సూచించారు. ఇలా శనివారం బోధన్, ఆదిలాబాద్, వేములవాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయభేరి సభల్లో రాహుల్ ప్రసంగంలోని ప్రధాన అంశాలను ఈనాడు ప్రచురించింది.
కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పచ్చి మోసం
తెలంగాణలో నిరుద్యోగం ఈ స్థాయిలో వుండటానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.55 ఏళ్లు అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిస్సహాయ స్థితిలోకి నెట్టిందన్నారు. ఇప్పుడు తెలంగాణలో గెలిచేందుకు యువతను రెచ్చగొట్టి చిచ్చుపెట్టాలని రాజకీయ నిరుద్యోగి రాహుల్ గాంధీ చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తానంటోంది... ఇది అసాధ్యమని తెలిసినా హామీ ఇస్తున్నారని అన్నారు. 2024 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు... ఎందుకంటే అదే సమయంలో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ అమల్లో వుంటుందని అన్నారు. అలాంటప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎలా సాధ్యమన్నారు. ఇలా హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ నిర్వహించిన రోడ్ షో కు సంబంధించిన వార్తను ఈనాడు మొదటిపేజీలో ప్రచురించింది.
Top Stories : రైతుబంధు పంపిణీ షురూ, రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్...మెట్రోలో కేటీఆర్...
ఆంధ్ర ప్రదేశ్ లో పారిశ్రామికోత్సాహం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే భారీ పరిశ్రమల ఏర్పాటు కానున్నాయని... రూ.2400 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయంటూ 'పారిశ్రామికోత్సవం' టైటిల్ తో సాక్షి దినపత్రిక ప్రధాన వార్తను ప్రచురించింది. నంద్యాలలో రూ.550 కోట్లతో జెఎస్‌డబ్ల్యు యూనిట్ ఏర్పాటు కానుంది. అలాగే ఎంఎస్ఎంఈ కోసం రూ.263 కోట్లతో రాష్ట్రంలో 18 చోట్ల ఐడీ,ఎఫ్ ఎఫ్ సి ల అభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ.402 కోట్లతో 5 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు జరుగుతోందని... ఇప్పటికే నెల్లూరులో రూ.230 కోట్లతో ఏర్పాటుచేసిన గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ఉత్పత్తికి సిద్దంగా వుంది. ఇంధన రంగంలో రూ.800 కోట్లతో రెండు యూనిట్లు ఏర్పాటు కానున్నాయని... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతులమీదుగా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారని... ఇప్పుడు ఆయన చేతులమీదుగానే ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా రాష్ట్ర ప్రభుత్వ సహకారంలో పారిశ్రామికాభివృద్ది జరుగుతోందని... పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారంటూ సాక్షి ప్రత్యేకకథనం ప్రచురించింది.
నేడు తిరుపతికి ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరుపతి పర్యటనకు సంబంధించిన వార్తను సాక్షి ప్రధాన వార్తగా ప్రచురించింది. నేడు సాయంత్రం తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు స్వాగతం పలకనున్నారు. విమానాశ్రయం నుండి
నేరుగా తిరుమలకు వెళ్ళి రాత్రి అక్కడే బస చేయనున్నారు. సోమవారం ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రధాని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఇలా కేవలం స్వామివారి దర్శనంకోసమే ప్రధాని తిరుపతికి వెళుతున్నారని సాక్షి తెలిపింది.
సాధికారత సభలు సక్సెస్
వైసిపి ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికారత సభలకు ప్రజలనుండి విశేష స్పందన వస్తోందని... తాజాగా సబ్బవరం, తునిలో జరిగిన సభకు భారీగా ప్రజలు తరలివచ్చారంటూ సాక్షి దినపత్రిక ప్రచురించింది. వేలాదిమంది యువత బైక్ ర్యాలీలు చేపడితే... మహిళలు కూడా యాత్రలకు బ్రహ్మరథం పట్టారు. 'జగన్ రావాలి - జగనే కావాలి' నినాదాలు సాధికారత సభాప్రాంగణమంతా ప్రతిధ్వనిస్తున్నాయని పేర్కొంది. జగన్ సర్కార్ ఎస్సి, ఎస్టీ, బిసి,మైనారిటీ వర్గాలకు జరిగిన లబ్ది... గతంలో చంద్రబాబు ఈ వర్గాలను వంచించిన తీరు గురించి మంత్రులు ప్రజలకు వివరించినట్లు సాక్షి తెలిపింది.
విశాఖ హార్బర్ అగ్నిప్రమాదానికి మామా అల్లుడి పనే...
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద కేసును పోలీసులు చేధించారు. ఈ అగ్నిప్రమాదానికి వాసుపల్లి నాని, అతడి మామ అల్లిపల్లి సత్యం కారణమని... వారిద్దరూ ఓ బోట్ లో మందుపార్టీ చేసుకుని బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. సిగరెట్ కాల్చి అది ఆర్పకుండానే పక్కబోటులోకి విసిరేసారని... ఇదికాస్తా చేపలు పట్టేందుకు ఉపయోగించే నైలాన్ వలపై పడింది. దీంతో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయని... ఇలా హార్బర్ లోని ఇతర బోట్లకు మంటలు వ్యాపించి దగ్దమయ్యాయని తెలిపారు. సిసి ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించామని... ఇప్పటికే వారిని అరెస్ట్ చేసినట్లు విశాఖ సిపి రవిశంకర్ తెలిపారు. ఇలా విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదానికి సంబంధించిన వార్తలు సాక్షి మొదటిపేజీలో ప్రచురించింది.
ఓటమి భయంతోనే కేసీఆర్, రేవంత్ రెడ్డి కామారెడ్డికి వచ్చారు... మోదీ
గజ్వేల్ లో సీఎం కేసీఆర్, కొడంగల్ లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గెలిచే అవకాశాలు లేవని... ఓటమి భయంతోనే వారు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సొంత నియోజకవర్గాల్లో ప్రజావ్యతిరేకతను గుర్తించిన ఈ ఇద్దరూ కామారెడ్డికి వచ్చారు... కానీ ఇక్కడి ప్రజలు కూడా వారిని చిత్తుగా ఓడించేందుకు సిద్దంగా వున్నారన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ది బిజెపి తోనే సాధ్యమని... ఇందుకు తాను పూచీ ఇస్తున్నానని ప్రధాని అన్నారు. తెలంగాణ ప్రజలముందు తాను మాట్లాడే ప్రతి మాట గ్యారంటీనే అని... ఇప్పుడిచ్చే ప్రతి హామీని అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని ప్రధాని అన్నారు. ఇలా కామారెడ్డి, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక మెయిన్ వార్తగా ప్రచురించింది.
Narendra Modi...సకల జనుల సౌభాగ్య తెలంగాణ లక్ష్యం: కామారెడ్డి సభలో నరేంద్ర మోడీ
రిస్క్ వద్దు... మళ్ళీ కారుకే ఓటు గుద్దు
తెలంగాణ ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరోపార్టీని నమ్మి రిస్క్ చేయొద్దని... మళ్ళీ కారు గుర్తుకే ఓటేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మంత్రి హరీష్ రావు కోరారు. కరెంట్ కావాలంటే బిఆర్ఎస్ రావాలి... కాబట్టి కారుగుర్తును గుర్తుపెట్టుకోవాలన్నారు. మంగళవారమే రైతు బంధు డబ్బులు అన్నదాతల ఖాతాలో పడతాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో హరీష్ ఎన్నికల ప్రచారంకు సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది.
కరెంట్ 3 గంటలే... ఇదీ కాంగ్రెస్ రహస్య ఎజెండా
తెలంగాణ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని... కేవలం నాలుగైదు గంటలు ఇస్తే చాలనే ఆలోచనలో కాంగ్రెస్ వుందంటూ నమస్తే తెలంగాణ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత భట్టి విక్రమార్క, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ కరెంట్ గురించి చేసిన వ్యాఖ్యలును నమస్తే తెలంగాణ గుర్తుచేసింది. కాంగ్రెస్ వస్తే కరెంట్ కోసం రైతులు మళ్లీ బాయికాడ పండుకునే రోజులు వస్తాయన్నారు. 3 గంటలు బయికాడ పంటే రేవంత్ కు వ్యవసాయం చేసే రైతుల బాధలు తెలుస్తాయి... ఏసి రూముల్లో పంటే ఏం తెలుస్తాయంటూ ఓ మహిళ మాటలను నమస్తే తెలంగాణ ప్రచురించింది.
KCR: 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఆత్మహత్యలు, వలసలతో నిండిపోయింది.. కేసీఆర్ ఫైర్