ys jagan mohan reddy: రేపు ప్రధాని మోడీ కోసం తిరుపతికి సీఎం వైఎస్ జగన్

By Siva KodatiFirst Published Nov 25, 2023, 8:07 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు తిరుమలకు వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం రాష్ట్రానికి వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలికేందుకు జగన్ తిరుపతి వెళ్లనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు తిరుమలకు వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం రాష్ట్రానికి వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలికేందుకు జగన్ తిరుపతి వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ప్రధానికి స్వాగతం పలికిన అనంతరం జగన్ తిరిగి విజయవాడ చేరుకోనున్నారు. 
ప్రధాని మోడీ, సీఎం వైఎస్ జగన్ పర్యటనల నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుమల కొండపైకి చేరుకునే మార్గం పొడవునా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 

కాగా..  శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ప్రధాని పర్యటనకు సంబంధించిన  ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన సాయంత్రం మోడీ తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారని.. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారని… 27వ తేదీ ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని సీఎస్ తెలిపారు.

Latest Videos

ALso Read: Narendra Modi : నేడు హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. మూడు రోజుల పాటూ తెలంగాణలోనే..

దర్శనానంతరం తిరుపతి నుంచి మళ్లీ హైదరాబాదుకు బయలుదేరి వెళ్తారని.. ఈ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వివిఐపి పర్యటన నిబంధన ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేసినట్లుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సిఎస్ సూచించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో  ఎలాంటి పొరపాట్లు జరగకుండా..అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సీఎస్ ఆదేశించారు. 


 

click me!