దగ్గుబాటిని టార్గెట్ చేసిన టీడీపి నేతలు, గొంతుకలిపిన కాంగ్రెస్

By Nagaraju TFirst Published Jan 28, 2019, 5:56 PM IST
Highlights


దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరికపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేష్ చెంచురాం వైసీపీలో చేరే అంశంపై రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటుగా విమర్శించారు. 
 

విజయవాడ: ఏపీ రాజకీయాల్లో దగ్గుబాటి కుటంబం హల్ చల్ చేస్తోంది. గత కొంతకాలంగా రాజకీయాల్లో స్తబ్ధుగా ఉన్న దగ్గుబాటు వెంకటేశ్వరరావు ఆదివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం రాజకీయంగా దుమారం రేపుతోంది. 

దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అల్లుడు అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ జగన్ తో భేటీ కావడం పెద్ద చర్చకు దారి తీసింది. జగన్ తో భేటీ అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వరరావు త్వరలో మంచిరోజు చూసుకొని జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించేశారు. 

దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరికపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేష్ చెంచురాం వైసీపీలో చేరే అంశంపై రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటుగా విమర్శించారు. 

అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుందని ఆరోపించారు. రాజకీయ జీవితంలో దగ్గుబాటి మారని పార్టీలు లేవని ఆర్ఎస్ఎస్ మొదలు అన్ని పార్టీల చుట్టూ దగ్గుబాటి కుటుంబం ప్రదక్షిణలు చేసిందని బాబు ధ్వజమెత్తారు. 

బీజేపీ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి ఇప్పుడు వైసీపీలలో చేరుతున్నారని మండిపడ్డారు. అటు కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు సైతం దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

తాజాగా వీరి సరసన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ చేరారు. పురంధీశ్వరి బీజేపీలో ఉండి ఆమె కుమారుడి హితేష్ చెంచురాం ని వైసీపీలో చేర్పించడం సిగ్గు చేటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, వైసీపీ తెరచాటు భాగోతానికి దగ్గుబాటి చేరిక నిదర్శనమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

దగ్గుబాటి ఎఫెక్ట్: పర్చూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి

బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ పై దగ్గుబాటి కుట్ర: చంద్రబాబు

దగ్గుబాటి మారని పార్టీలు లేవు: తోడల్లుడిపై చంద్రబాబు వ్యాఖ్యలు

వైసీపీలోకి హితేష్, బీజేపీలోనే పురంధేశ్వరీ: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

జగన్‌తో భేటీ: వైసీపీలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్

ఆ క్లియరెన్స్ వస్తే వైసీపీలోకి హితేష్: పురంధేశ్వరీ బీజేపీలోనే?

హరిబాబు దూరం: విశాఖ సీటు పురంధేశ్వరిదే

జగన్‌కు క్లీన్‌చీట్,‌ దగ్గుబాటి లంచం పర్చూరు టికెట్: బుద్ధా వెంకన్న

 

click me!