ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత

By narsimha lode  |  First Published Jan 22, 2020, 12:08 PM IST

ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని  కోరుతూ టీడీపీ నాయకత్వం శాసనమండలి ఛైర్మెన్ కు నోటీసులు ఇచ్చారు. 


అమరావతి: పార్టీ విప్‌ను ధిక్కరించి మూడు రాజధానుల బిల్లుపై ప్రభుత్వానికి ఓటేసిన టీడీపీ ఎమ్మెల్సీలపై ఆ పార్టీ చర్యలకు సిద్దమైంది. విప్‌ను ధిక్కరించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్‌కు బుధవారం నాడు లేఖ అందించింది.

Also read:మండలిలో జగన్‌కు షాక్: ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ నోటీసు

Latest Videos

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల విషయంలో శాసనమండలిలో మంగళవారం నాడు రాత్రి  ఓటింగ్ జరిగింది.  ఈ సమయంలో  టీడీపీ విప్‌ను ధిక్కరించి పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలు ఓటు వేశారు. ఈ ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకత్వం బుధవారం నాడు ఎంఏ షరీఫ్‌కు లేఖను అందించింది.  

Also read:రూల్ 71: బుగ్గన ఆ ప్రతిపాదన ఎందుకు చేశారు

Also read:మండలిలో టీడీపీ పట్టు: రూల్ 71 అంటే ఏమిటీ?

శాసనమండలికి విధిగా హాజరుకావాలని పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని విప్ జారీ చేసింది. అయితే టీడీపీ ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, శమంతకమణిలు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణంగానే శమంతకమణి శాసనమండలి సమావేశానికి దూరంగా ఉన్నట్టుగా చెబుతోంది.

also read:ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ: శాసనమండలి రద్దే ఎజెండా?

Also read:మండలిలో వైఎస్ జగన్ కు షాక్: ఏం చేద్దాం, ప్రత్యామ్నాయాలు ఇవీ

డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి మంగళవారం నాడు రాజీనామా చేశారు.  మరో వైపు ఇద్దరు ఎమ్మెల్సీలు  మాత్రం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు చేశారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలను కోరుతోంది టీడీపీ నాయకత్వం.

Also read:మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?

also read: ఢిల్లీకి పవన్ కళ్యాణ్: బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ

Also read:అందుకే టీడీపీ ఒక్క స్థానంలోనే గెలిచింది: అసెంబ్లీలో జగన్

ఎవరీ పోతుల సునీత
ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని మానవపాడు మండలం శాంతినగర్‌‌లో పోతుల సునీత నివాసం ఏర్పాటు చేసుకొంది.  మాజీ మంత్రి పరిటాల రవికి సన్నిహితుడుగా పేరున్న పోతుల సురేష్ భార్యే పోతుల సునీత.

Also read:జగన్‌కు షాక్: మండలిలో టీడీపీ నోటీసుపై చర్చకు అనుమతి

Also read:బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ

Also read:ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసన: హెడ్‌సెట్ తీసేసి కోపంగా వెళ్లిన స్పీకర్ తమ్మినేని

ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని గద్వాలలో విద్యాభ్యాసం చేసే సమయంలో  పోతుల సురేష్ పటేల్ సుధాకర్ రెడ్డి,  సుదర్శన్ రెడ్డిలతో పరిచయం కారణంగా రాడికల్స్ విద్యార్థి విభాగంలో పనిచేశాడు.

ఆ తర్వాత ఆర్ఎస్‌యూ ఆర్గనైజేషన్ కోసం అనంతపురం కు వెళ్లాడు. అదే సమయంలో అదే జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో పనిచేస్తున్న సమయంలోనే సునీతతో సురేష్‌కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ వివాహం చేసుకొన్నారు.

పరిటాల రవి బతికున్న సమయంలో  ఆర్ఓసీ ఏర్పాటు చేసి మాజీ మంత్రి పరిటాల రవికి వ్యతిరేకంగా ఉన్న వారిని ఆర్‌ఓసీ నిర్మూలించింది. పరిటాల రవికి ఆర్‌ఓసీ అనుకూలంగా పనిచేసిందనే వాదన అప్పట్లో బలంగా ఉండేది.ఈ ప్రచారాన్ని పోతుల సురేష్ మాత్రం కొట్టిపారేస్తారు.

పరిటాల రవి చనిపోవడానికి కొద్ది రోజుల ముందే పోతుల సురేష్, చమన్ అజ్ఞాతంలోకి  వెళ్లారు. పరిటాల రవిని కూడ విదేశాలకు వెళ్లాలని కూడ వారు సూచించారు. కానీ రవి మాత్రం వెంకటాపురంలోనే ఉన్నారు. ఆ తర్వాత రవి హత్యకు గురయ్యారు.ఇదిలా ఉంటే  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పోతుల సురేష్ పోలీసులకు చిక్కాడు. 

2004 ఎన్నికల్లో ఆలంపూర్ నుండి పోతుల సునీత టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైంది. అనంతపురం జిల్లా నుండి టిక్కెట్టు కావాలని పోతుల సురేష్ ప్రయత్నాలు చేశారు.కానీ, ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లా నుండి టిక్కెట్టు ఇచ్చింది టీడీపీ నాయకత్వం.

2014 ఎన్నికల్లో అనంతపురం, మహాబూబ్ నగర్ జిల్లాల నుండి కూడ టీడీపీ టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే  ఆ సమయంలో  ఆమెకు ఈ రెండు జిల్లాల్లో టీడీపీ టిక్కెట్టు దక్కలేదు. దీంతో ప్రకాశం జిల్లా చీరాల టిక్కెట్టును చంద్రబాబునాయుడు కేటాయించారు. చీరాల నుండి ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

ఎన్నికల తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవిలో సునీత కొనసాగుతున్నారు. మంగళవారం నాడు పాలనా వికేంద్రీకరణ బిల్లు  సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై జరిగిన ఓటింగ్‌లో టీడీపీ విప్ కు వ్యతిరేంకగా సునీత ఓటు చేసింది..దీంతో ఆమెపై అనర్హత వేటు వేయాలని టీడీపీ మండలి చైర్మెన్‌ను కోరింది.

click me!