ఒంటిపై నూలుపోగు లేకుండా మహిళ.. పక్కనే కండోమ్ ప్యాకెట్లు

Published : Jan 22, 2020, 11:46 AM IST
ఒంటిపై నూలుపోగు లేకుండా మహిళ.. పక్కనే కండోమ్ ప్యాకెట్లు

సారాంశం

ఒంగోలులోని కేశవరాజు కుంట శివారులో బుధవారం ఉదయం దారుణ దృశ్యాలు వెలుగు చూశాయి. ఓ గుర్తు తెలియని మహిళ వివస్త్రగా పడి ఉంది.  ఉదయాన్నే పనుల మీద వెళ్తున్న కొందరు స్థానికులు ఆమెను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  

సమాజంలో ఆడవారికి రక్షణ రోజు రోజుకీ కరువైపోతోంది. ఆడది ఒంటరిగా రోడ్డు మీదకు వెళ్లి క్షేమంగా ఇంటికి చేరడమే గగనమైపోతోంది.ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన  చట్టాలు తీసుకువస్తున్నా.. నేరం చేయాలి అనే ఆలోచన వచ్చిన వారిని మాత్రం ఆపలేకపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది చిన్నారులు, మహిళలు మృగాళ్ల బారిన పడ్డారు. కొందరు బాధితులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు జీవచ్ఛవాలుగా బతుకులీడుస్తున్నారు. కాగా.. తాజాగా ఒంగోలులో ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది.

ఒంగోలులోని కేశవరాజు కుంట శివారులో బుధవారం ఉదయం దారుణ దృశ్యాలు వెలుగు చూశాయి. ఓ గుర్తు తెలియని మహిళ వివస్త్రగా పడి ఉంది.  ఉదయాన్నే పనుల మీద వెళ్తున్న కొందరు స్థానికులు ఆమెను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Also Read పెళ్లికి నో చెప్పిందని ఇంటికి నిప్పు: ఇద్దరు సజీవ దహనం, నలుగురికి గాయాలు..

కాగా... సదరు మహిళ ఒంటిపై కనీసం నూలుపోగు కూడా లేదు. ఆమె కూడా అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆ పక్కనే మహిళ లో దుస్తులు, నల్లపూసల దండ, కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. దీంతో.. మహిళపై అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

సదరు మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ ఎవరు.. ఏమిటి..  ఏప్రాంతానికి చెందిన వారు అనే విషయాలు ఏమీ తెలీలేదు. ఆమెకు స్పృహ వస్తేనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

నేను మారాను నన్ను నమ్మండి అనడం చంద్రబాబు కి అలవాటే: Perni Nani Comments | YCP | Asianet News Telugu
మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu