అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

By Nagaraju penumalaFirst Published Aug 16, 2019, 5:19 PM IST
Highlights

వరదలు వస్తే అమరావతి కూడా ఇలాగే నీటమునిగిపోతుందని తెలియజేసేందుకే డ్రోన్ల సాయంతో వీడియోలు తీసి ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందనని ఆరోపిస్తున్నారు. అమరావతిలో రాజధానిని నిర్మించడం వైసీపీకి మెుదటి నుంచి ఇష్టం లేదని అందువల్లే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందంటూ టీడీపీ ఆరోపిస్తోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అమరావతిలో వరుసగా జరుగుతున్న పరిణామాలు రాజధాని తరలింపుకోసమే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

కృష్ణానదికి వస్తున్న వరదలను ఆసరాగా చేసుకుని రాజధాని తరలించేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందంటూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఇంటి వద్ద డ్రోన్ల వినియోగం ఆ కుట్రలో భాగమేనని ప్రచారం చేస్తోంది. 

వరదలు వస్తే అమరావతి కూడా ఇలాగే నీటమునిగిపోతుందని తెలియజేసేందుకే డ్రోన్ల సాయంతో వీడియోలు తీసి ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందనని ఆరోపిస్తున్నారు. అమరావతిలో రాజధానిని నిర్మించడం వైసీపీకి మెుదటి నుంచి ఇష్టం లేదని అందువల్లే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందంటూ టీడీపీ ఆరోపిస్తోంది.

ఇప్పటికే అమరావతి వద్ద ఇండస్ట్రీయల్ పార్క్ కు సంబంధించి 22 కంపెనీలకు భూములు అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఇలా వరుసగా అమరావతి చుట్టుపక్కల అన్నీ ఖాళీ చేయించి ప్రజలకు ఎక్కడా లేని అపోహలు సృష్టించి రాజధానిని కడపకు, లేదా ప్రకాశం జిల్లాకు తరలించే కుట్ర జరుగుతోందంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.  

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి పెద్ద స్కాం అని పదేపదే ఆరోపించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి స్కామ్ ను బయటపెడతామని పదేపదే హెచ్చరిస్తోంది. 

అంతేకాదు అమరావతిలో జరుగుతున్న పనులను కూడా నిలిపివేసింది ప్రభుత్వం. మరోవైపు అమరావతి నిర్మాణంలో సహకరించే అంశంపై ప్రపంచ బ్యాంకుతోపాటు చైనాకు చెందిన ఆసియా బ్యాంకు కూడా గుడ్ బై చెప్పేశాయి.  

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాజెక్టు నిర్మాణం విషయమై పలువురు రైతులు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో  ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకూడదని ప్రపంచ బ్యాంకు నిర్ణయం తీసుకొంది.  

మరోవైపు చైనాకు చెందిన ఆసియా మౌళిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు కూడ అమరావతి ప్రాజెక్టు నుండి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది. అమరావతి ప్రాజెక్టు కోసం చైనాకు చెందిన ఈ బ్యాంకు 200 మిలియన్ డాలర్లు ఇవ్వాలని భావించింది. 

అయితే అమరావతిలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రెండు ప్రతిష్టాత్మక బ్యాంకులు వెనక్కివెళ్లిపోయాయి. దాంతో రాజధాని నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం సైతం బడ్జెట్ లో అమరావతికి అత్యల్పంగా నిధులు కేటాయించింది. కేంద్రప్రభుత్వం అయితే రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్తుందే కానీ క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. ఇదంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ అంటూ ప్రచారం జరుగుతుంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

డ్రోన్ వినియోగంపై పోలీసులకు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ జనార్థన్ ఫిర్యాదు

వరద అంచనా కోసమే డ్రోన్ల వినియోగం, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది: మంత్రి అనిల్

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత: టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ

డ్రోన్ కెమెరా వినియోగం: చంద్రబాబు ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ రిప్లై

డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్

చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు

డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్

ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే

click me!