డ్రోన్ వినియోగంపై పోలీసులకు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ జనార్థన్ ఫిర్యాదు

By Nagaraju penumalaFirst Published Aug 16, 2019, 4:18 PM IST
Highlights

డ్రోన్లతో విజువల్స్ తీస్తున్న వారిని తాము పట్టుకున్న పోలీసులు వారిని తప్పించే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. ఇకపోతే తనపై ఓ సీఐ దైర్జన్యం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ టీడీ జనార్థన్. చంద్రబాబు నివాసంలోకి పోలీసు అధికారితోపాటు మరో ఇద్దరు వెళ్లారని వారిని పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రోన్ల వినియోగం వెనుక మర్మం ఏంటో స్పష్టం చేయవాలని జనార్థన్ డిమాండ్ చేశారు. 

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై డ్రోన్ విజువల్స్ తీయడంపై మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న చంద్రబాబు ఇంటిపై డ్రోన్ విజువల్స్ తీయడంపై తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్, టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

చంద్రబాబు నాయుడు ఇంటిపై డ్రోన్లతో విజువల్స్ తీస్తున్న వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు అని తెలుగు యువత అధ్యక్షుడు అవినాష్ స్పష్టం చేశారు. ధర్మేందర్ రెడ్డి, చక్రధర్ రెడ్డి అనే వ్యక్తులు వైసీపీ కార్యాలయంలో పనిచేసే కిరణ్ అనే వ్యక్తి పంపించడం వల్లే డ్రోన్లతో వీడియో తీసారని వారు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని దేవినేని అవినాష్ ఆరోపించారు. 

డ్రోన్లతో విజువల్స్ తీస్తున్న వారిని తాము పట్టుకున్న పోలీసులు వారిని తప్పించే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. ఇకపోతే తనపై ఓ సీఐ దైర్జన్యం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ టీడీ జనార్థన్.

చంద్రబాబు నివాసంలోకి పోలీసు అధికారితోపాటు మరో ఇద్దరు వెళ్లారని వారిని పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రోన్ల వినియోగం వెనుక మర్మం ఏంటో స్పష్టం చేయవాలని జనార్థన్ డిమాండ్ చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

వరద అంచనా కోసమే డ్రోన్ల వినియోగం, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది: మంత్రి అనిల్

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత: టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ

డ్రోన్ కెమెరా వినియోగం: చంద్రబాబు ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ రిప్లై

డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్

చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు

డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్

ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే

click me!