అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

By narsimha lodeFirst Published Sep 24, 2018, 12:06 PM IST
Highlights

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ హత్య  జరిగిన సంఘటనా స్థలానికి  పోలీసు ఉన్నతాధికారులు మోటార్‌బైక్‌పై  సోమవారం నాడు చేరుకొన్నారు


అరకు: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ హత్య  జరిగిన సంఘటనా స్థలానికి  పోలీసు ఉన్నతాధికారులు మోటార్‌బైక్‌పై  సోమవారం నాడు చేరుకొన్నారు.  ఆదివారం నాడు మావోయిస్టులు  అరకు ఎమ్మెల్యే  సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమను మావోయిస్టులు కాల్చి చంపారు.

అరకు ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావు,  మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలను  చంపిన ప్రదేశాన్ని  ఏపీ ఇంటలిజెన్స్  చీఫ్, అడిషనల్ డీజీ లు  మోటార్‌బైక్ పై  పరిశీలించారు. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ తో పాటు ఇతర పోలీసు అధికారులు కూడ  బైక్‌లపై  పోలీసు ఉన్నతాధికారులను అనుసరించారు.

మావోయిస్టులు ఆదివారం నాడు  గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివిరి సోమను చుట్టుముట్టి కాల్చి చంపారు.

ఈ ఘటనతో పోలీసులు  సవాల్‌గా తీసుకొన్నారు. ఈ ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉన్న పోలీసుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు మావోయిస్టులను ఎదుర్కొనే వ్యూహారచన చేసేందుకు పోలీస్ బాస్ లు సంఘటన స్థలానికి బైక్‌లపై వెళ్లారు.

కొంతకాలంగా చడీచప్పుడు లేకుండా ఉన్న మావోలు అదునుచూసి ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను హత్య చేసి తమ ఉనికిని చాటుకొన్నారు. మొత్తంగా  ఈ ఘటన  రెండు తెలుగు రాష్ట్రాల్లో  సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

' దసరాకు వస్తాను.. మధ్యలో రావడం కుదరదు,'ఇంతలోనే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

 

 

click me!