కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

By narsimha lodeFirst Published Sep 24, 2018, 11:45 AM IST
Highlights

 దసరాకు వస్తాను... మధ్యలో రావడం నాకు కుదరదమ్మా.... అంటూ తనతో తండ్రి మాట్లాడిన చివరి మాటలు ఇవే అంటూ సర్వేశ్వరరావు కూతురు గద్గదస్వరంతో చెప్పారు. 

అరకు: దసరాకు వస్తాను... మధ్యలో రావడం నాకు కుదరదమ్మా.... అంటూ తనతో తండ్రి మాట్లాడిన చివరి మాటలు ఇవే అంటూ సర్వేశ్వరరావు కూతురు గద్గదస్వరంతో చెప్పారు. 

సోమవారం నాడు  తండ్రి మృతదేహం వద్ద ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు. రెండు రోజుల క్రితమే తండ్రి తన వద్దకు వచ్చాడని ఆమె గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకొన్నారు. అసెంబ్లీ సెషన్స్ ముగించుకొని తన వద్దకు వచ్చారని ఆమె గుర్తు చేసుకొన్నారు.

మధ్యాహ్నం నాన్నతో కలిసి భోజనం చేసినట్టు ఆమె చెప్పారు. సాయంత్రం వరకు సరదాగా తండ్రితో గడిపినట్టు ఆమె చెప్పారు.  అయితే రాత్రిపూట తనను కాలేజీ హాస్టల్ వద్ద దింపేసి వెళ్లిపోయాడని ఆమె చెప్పారు.

దసరాకు వస్తానని తనతో చెప్పాడని.. మధ్యలో రావడం కుదరదని తండ్రి తనతో చెప్పాడని ఆమె గుర్తు చేసుకొని విలపించారు.  అయితే  తాను తండ్రితో మాట్లాడేందుకు ప్రయత్నించినా..సిగ్నల్స్ లేని కారణంగా తండ్రితో మాట్లాడేందుకు సాధ్యం కాలేదని ఆమె చెప్పారు. 

రెండు రోజుల క్రితం మాట్లాడిన మాటలే చివరి మాటలౌతాయని మాత్రం తాను అనుకోలేదని  సర్వేశ్వరరావు కూతురు  చెప్పారు. ఇదిలా ఉంటే మరోవైపు రెండు రోజుల క్రితం రాత్రిపూట తండ్రితో మాట్లాడినట్టు సర్వేశ్వరరావు కొడుకు చెప్పారు.మావోయిస్టుల నుండి  బెదిరింపులు ఉన్న విషయం తమతో ఏనాడూ కూడ నాన్న చెప్పలేదని సర్వేశ్వరరావు కొడుకు చెప్పారు. 

సంబంధిత వార్తలు

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

 

click me!