కొలిక్కి వచ్చిన విద్యార్థిని రేప్, న్యూడ్ వీడియో కేసు: సూత్రధారులు వీరే

By narsimha lodeFirst Published Jul 6, 2020, 6:10 PM IST
Highlights

గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధిని నగ్న వీడియోలను బాధితురాలికే నిందితులు పంపారని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.  


అమరావతి: గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధిని నగ్న వీడియోలను బాధితురాలికే నిందితులు పంపారని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.  

గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సోమవారం నాడు సాయంత్రం మీడియాతో మాట్లాడారు. 2017లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను క్రియేట్ చేశాడు మణికంఠ. బాధితురాలికే నిందితుడు వీడియోలను పంపాడు. అంతేకాదు ఇంకా ఏమైనా ఫోర్న్ వీడియోలు లేదా ఫోటోలు ఉంటే పంపాలని నిందితుడు కోరినట్టుగా ఎస్పీ వివరించారు. 

ఫోర్న్ వీడియోలు, ఫోటోలు లేకపోతే తనకు డబ్బులు ఇవ్వాలని  బాధితురాలిని నిందితులు డిమాండ్ చేసినట్టుగా ఎస్పీ తెలిపారు.

డబ్బులు ఎలా చెల్లించాలని బాధిత విద్యార్ధిని నిందితుడిని కోరింది. బ్యాంకు ఖాతా వివరాలు చెబితే తాము దొరికిపోతామని నిందితుడు భావించాడు. దీంతో కొంత కాలం ఈ విషయమై బాధితురాలికి నిందితుడు ఫోన్ చేయలేదని ఆయన తెలిపారు.

ఇదే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ధనుంజయ్ రెడ్డి, తులసికృష్ణలు కూడ చాట్ చేశారని ఆయన వివరించారు. వరుణ్ తేజ్, కౌశిక్, మణికంఠ, ధనుంజయ్ రెడ్డిలు కుట్రకోణంతో వ్యవహరించారని తమ దర్యాప్తులో తేలిందన్నారు. 

also read:గుంటూరులో ఇంజనీరింగ్ స్టూడెంట్ నగ్న దృశ్యాల కేసు: మరో ఇధ్దరి అరెస్ట్

ధనుంజయ్ రెడ్డి, కౌశిక్ లకు మధ్య భాస్కర్ ఉన్నాడని తాము గుర్తించినట్టుగా ఎస్పీ తెలిపారు. సాక్ష్యాల ఆదారంగా ఏడుగురిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకా నలుగురైదుగురు కూడ ఇన్ వాల్వ్ అయినట్టుగా తాము అనుమానిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. 

ఈ విషయమై బాధిత యువతి ధైర్యంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందన్నారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ప్రకారంగా నిందితులకు శిక్ష పడుతోందని భావిస్తున్నట్టుగా  పోలీసులు భావిస్తున్నారు. సైబర్ స్పేస్ లో ఏ తప్పు చేసినా దొరికే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. 

పదే పదే అదే తప్పులు చేస్తే విద్యార్థులపై రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సి వస్తోందని ఎస్పీ హెచ్చరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. 

click me!