అరెస్టైన వారిలో ఒకరిది తెనాలి ప్రాంతానికి చెందినవాడు. మరొకరిది గుంటూరుగా పోలీసులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ లో మై నేమ్ ఈజ్ 420 పేరుతో ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన యువకుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారని తెలుస్తోంది.

బాధిత విద్యార్ధినితో పాటు గతంలో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులతో పాటు తాజాగా అరెస్ట్ చేసిన నిందితులు కూడ ఒకే కాలేజీలో చదువుకొన్నారని పోలీసుల విచారణలో తేలింది.

also read:ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధినిపై రేప్: ఎవరిని వదలేది లేదన్న ఎస్పీ అమ్మిరెడ్డి

తెనాలికి చెందిన యువకుడు ఇన్ స్టాగ్రామ్ లో యువతి నగ్న దృశ్యాలను పోస్టు చేశాడు. మరో యువకుడు ఈ దృశ్యాలను షేర్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న ఏ1, ఏ2 నిందితులు వరుణ్ తేజ్, కౌశిక్ లు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు. 
ఇన్ స్టాగ్రామ్ లోని దృశ్యాలను షేర్ చేసిన యువకుడిని హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు. 

ఈ కేసును పోలీసులు అత్యంత సీరియస్ గా తీసుకొన్నారు. ఈ విషయమై గుంటూరు అర్బన్ ఎస్పీతో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గత నెలలో సమావేశమయ్యారు. కేసు వివరాలను అడిగి తెలుసుకొన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆమె హామీ ఇచ్చారు.