జగన్ పై దాడి కేసు: ఎన్ఐఏ విచారణకు హాజరైన వైసీపీ నేతలు వీరే

By Nagaraju TFirst Published Jan 19, 2019, 5:13 PM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హాత్యాయత్నం కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేసింది నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ. ఇప్పటికే నిందితుడు శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకుని విచారించిన ఎన్ఐఏ బృందం తాజాగా వైసీపీ అధినేతలను టార్గెట్ చేసింది. 

విశాఖపట్నం: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హాత్యాయత్నం కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేసింది నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ. ఇప్పటికే నిందితుడు శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకుని విచారించిన ఎన్ఐఏ బృందం తాజాగా వైసీపీ అధినేతలను టార్గెట్ చేసింది. 

వైసీపీ నేతల విచారణలో అయినా కీలక క్లూ రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. వైఎస్ జగన్ పై దాడి జరిగిన సమయంలో జగన్ వెంట ఉన్న వైసీపీ నేతలను విచారిస్తున్నారు. అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జగన్ పై కత్తితో దాడి జరిగిన సమయంలో ఆయన వెంట ఉన్న 9 మంది కీలక నేతలను ఎన్ఐఏ విచారిస్తోంది. 

విశాఖపట్నంకు చెందిన మళ్ల విజయప్రసాద్ నివాసంలో సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, మళ్ల విజయప్రసాద్, జియ్యాని శ్రీధర్, తైనాల విజయ్, కరణం ధర్మశ్రీ,, కేకే రాజు,రాజీవ్ గాంధీ, తిప్పల నాగిరెడ్డిలను ఎన్ఐఏ అధికారి వెంకటాద్రి నేతృత్వంలో అధికారుల బృందం విచారణ చేపట్టింది. 


దాడి ఎలా జరిగింది, నిందితుడు  కత్తిని తీసుకుని ఎలా వచ్చాడు, కత్తిని వైసీపీ నేతలు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, షర్ట్ ఎందుకు తీసుకెళ్లారు అనే అంశాలపై ఎన్ఐఏ బృందం ఆరా తీస్తుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ పై దాడి కేసు: హైకోర్టులో చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కెదురు

బెజవాడలో శ్రీనివాసరావుకు ముప్పు: రాజమండ్రి జైలుకు తరలింపు

ప్రజలతో మాట్లాడనిస్తే అంతా చెప్తా.. జగన్ పై దాడి కేసు నిందితుడు

జగన్‌పై దాడి కేసు: ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ ఏపీ సర్కార్ పిటిషన్

ఎన్ఐఏకు జగన్‌పై దాడి కేసు: హైకోర్టులో బాబు సర్కార్ పిటిషన్

జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు

జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం

జగన్ పై దాడి కేసు.. నేడు హైకోర్టులో విచారణ

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

జగన్‌ను ప్రజలే కాపాడుకొన్నారు: కన్నీళ్లు పెట్టుకొన్న విజయమ్మ

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌కు 120 కాల్స్, ఎవరీ కేకే

జగన్ పై దాడి.. హైకోర్టు సంచలన కామెంట్స్

జగన్‌పై దాడి: జోగి రమేష్‌ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత

జగన్ పై దాడి కేసు:విచారణకు హాజరైన జోగి రమేష్

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

 

 

click me!