ఫ్లోరిడాలో ఆగిపోయిన జయరాం భార్య: అంత్యక్రియలు మరింత జాప్యం

Published : Feb 02, 2019, 04:19 PM IST
ఫ్లోరిడాలో ఆగిపోయిన జయరాం భార్య: అంత్యక్రియలు మరింత జాప్యం

సారాంశం

జయరాం భార్య పద్మశ్రీ, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. జయరాం భార్య ఫ్లోరిడాలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. మంచు తుఫాను వల్ల ఆమె హైదరాబాదు రావడానికి ఆటంకం ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. 

హైదరాబాద్: దారుణంగా హత్యకు గురైన ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం అంత్యక్రియలు జరగడానికి మరింత సమయం తీసుకునే అవకాశం ఉంది. ఆయన మృతదేహాన్ని హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో భద్రపరిచారు. జయరాం కుటుంబ సభ్యులెవరు కూడా ఇప్పటి వరకు హైదరాబాదు చేరుకోలేదు.

జయరాం భార్య పద్మశ్రీ, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. జయరాం భార్య ఫ్లోరిడాలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. మంచు తుఫాను వల్ల ఆమె హైదరాబాదు రావడానికి ఆటంకం ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. 

జయరాం అంత్యక్రియలు రేపు (ఆదివారం) హైదరాబాదులో జరుగుతాయని భావించారు. కానీ, అది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు. నందిగామలో శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహాన్ని జయరాం మేనమామ బుచ్చయ్య చౌదరికి అప్పగించారు. 

మృతదేహాన్ని తీసుకుని బుచ్చయ్య చౌదరి హైదరాబాద్ వచ్చారు. మృతదేహాన్ని భద్రపరిచి, ఫ్లోరిడాలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఓ విమానానికి టికెట్లు బుక్ చేసుకున్నారని, అయితే మంచు తుఫాను కారణంగా ఆ విమానం రద్దయిందని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu