పోర్న్ వీడియోలు చూపించి బాలికపై అత్యాచారం.. తండ్రికి తెలుస్తుందనే భయంతో..

By telugu news teamFirst Published Oct 7, 2021, 2:43 PM IST
Highlights

నీలి చిత్రాలు చూపించి.. మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. రెండు నెలల నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
 

మైనర్ బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. బాలికకు నగ్న వీడియోలు చూపించి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు అయితే..ఈ విషయం తన తండ్రికి తెలిసిపోతుందేమోనని బాలిక బయపడింది. ఈ క్రమంలో  అపార్ట్మంట్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన విశాఖలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డిపేటకు చెందిన పాండ్రంగి సత్యం భార్య, కుమారుడితో కలిసి శనివాడలోని సాయి ప్రణయ్‌ రెసిడెన్సీలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో పెంట్‌హౌస్‌లో నివాసముంటున్నాడు. ఎదురుగా ఉన్న ఆదిత్య నివాస్‌లో సత్యం చెల్లెలు భర్త కూడా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. సత్యం కుమార్తె (14) అగనంపూడి హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. 

ఆదిత్య నివాస్‌ మొదటి అంతస్తులో కార్పెంటరీ పనులు చేస్తున్న ఆరుగురు యువకులు నివాసముంటున్నారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన దిగుమర్తి నరేష్‌ గత జూలైలో ఇక్కడకు వచ్చాడు. అగనంపూడిలో ఇంటీరియర్‌ పనులు చేస్తున్నాడు. ఎదుట అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆమె ఫోన్‌ నంబర్‌ సంపాదించాడు. నీలి చిత్రాలు చూపించి.. మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. రెండు నెలల నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.

కాగా.. మంగళవారం రాత్రి సత్యం ఇంట్లో అందరూ నిద్రపోయిన సమయంలో నరేష్‌ బాలికకు ఫోన్‌ చేసి రమ్మని కోరడంతో ఆమె ఆదిత్య నివాస్‌లోకి వెళ్లింది. ఈ లోగా ఆమె తండ్రి బాత్‌రూమ్‌ కోసం లేవడం, కుమార్తె లేకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పైన, కింద వెతికారు. ఆచూకీ లేకపోవడంతో ఎదురుగా ఉన్న బాలిక మేనత్త ఇంట్లో ఉందేమోనని వెళ్లి చూశారు. అక్కడ కూడా ఆమె లేకపోవడంతో ఏడుస్తూ.. కేకలు వేశారు. ఇది విన్న ఆమె.. నాన్నకు దొరికిపోతానేమోనన్న భయంతో అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పై నుంచి దూకేసింది. బాలిక మృతదేహం చూసి వారంతా షాక్‌కు గురయ్యారు. కుమార్తె మరణించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమార్తె మృతికి కారణమైన నరేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 
 

click me!