డిమాండ్ అండ్ సప్లయా? లేక బ్లాక్ మార్కెటా?..ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని కౌంటర్..

Published : Jan 05, 2022, 11:51 AM IST
డిమాండ్ అండ్ సప్లయా? లేక బ్లాక్ మార్కెటా?..ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని కౌంటర్..

సారాంశం

‘వంద రూపాయల టికెట్ ను.. వెయ్యి, రెండు వేలకు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పిందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు. డిమాండ్ అండ్ సప్లయ్ అంటారా? లేక బ్లాక్ మార్కెట్ అంటారా?’ అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. 

అమరావతి :  RGV ట్వీట్ కు మంత్రి perni nani కౌంటర్ ఇచ్చారు. ‘హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్ కు ఒక ఫార్ములా చెప్పారు. ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు? అన్నది పరిగణలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరలను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదని’  మంత్రి పేర్ని నాని tweet చేశారు.

’సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే.. మెడికల్, ఎడ్యుకేషన్ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం  భరించాలి అని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించడం లేదు.  థియేటర్లలో 
Movie ticket prices ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 The Law of Cinematography చెబుతోంది‘ అని ట్వీట్ చేశారు.

ధరలు తగ్గిస్తే మోటివేషన్ పోతుందని ఎకనామిక్స్ లో ప్రాథమిక సూత్రమని చెప్పారు.  ఎవరికి  వర్మ గారు?  అమ్మే వారికా?..  నిర్మాత శ్రేయస్సు గురించి మాట్లాడుతూ కన్జ్యూమర్ యాంగిల్ ను గాలికొదిలేశారు.  కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ.. అంటూ ట్వీట్ చేశారు.

‘వంద రూపాయల టికెట్ ను.. వెయ్యి, రెండు వేలకు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పిందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు. డిమాండ్ అండ్ సప్లయ్ అంటారా? లేక బ్లాక్ మార్కెట్ అంటారా?’ అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. 

AP Tickets Prices: టికెట్స్ ధరల వివాదం... ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి ఉతికిపారేసిన వర్మ

ఇదిలా ఉండగా, మంగళవారం వర్మ సోషల్ మీడియా వేదికగా సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని సూటిగా ప్రశ్నించారు. వర్మ తన ట్వీట్స్ లో...  నిత్యావసర వస్తువులు గోధుమ, వరి, నూనె, కిరోసిన్ ధరలు ప్రభుత్వం నియంత్రిస్తుంది. సినిమా టికెట్స్ కి ఈ సూత్రం ఎలా వర్తిస్తుంది.  ధాన్యం ధరలు తగ్గిస్తే.. రైతులు సైతం వాటిని పండించాలనే ఆసక్తికోల్పోతారు. దాని వలన లభ్యత, నాణ్యత తగ్గిపోతుంది. ఇదే సూత్రం సినిమాకు కూడా వర్తిస్తుంది. 

ఒకవేళ సినిమాను మీరు నిత్యావసర సేవగా భావిస్తే వైద్యం, విద్య విషయంలో అమలు చేస్తున్నట్లు సబ్సిడీ ఇవ్వండి. గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టండి. రేషన్ షాపుల మాదిరి రేషన్ థియేటర్స్ ఏర్పాటు చేయండి. నిత్యావసర ధరలు కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. టికెట్స్ ధరలు ప్రభుత్వం నిర్ణయించాల్సిన ప్రత్యేక పరిస్థితి ఇప్పుడు ఏమి తలెత్తిందో చెప్పండి. 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్