పవన్‌ని ఎవరైనా రేప్ చేశారా.. బాబు పరామర్శ దేనికి , రేపటిదాకా ఆగలేకపోయారా : మంత్రి అమర్‌నాథ్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 18, 2022, 6:00 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లపై మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. రాష్ట్ర ముఖచిత్రం మారబోతోందన్న పవన్ రేపటి దాకా కూడా ఆగలేకపోయారంటూ గుడివాడ సెటైర్లు వేశారు.

పవన్ కల్యాణ్ ఏమైనా గ్యాంగ్‌రేప్‌కు గురయ్యాడా చంద్రబాబు పరామర్శించడానికి అంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. దాడికి గురైంది వైసీపీ నేతలైతే... పవన్‌ను పరామర్శించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పెళ్లి చేసుకున్న భార్యనే మూడేళ్లకొకసారి వదిలేస్తున్నాడని.. రాజకీయ పార్టీని వదిలేయడం పవన్‌కు కొత్త కాదని గుడివాడ అమర్‌నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెళ్లి అంటే ఒక అడ్జెస్ట్‌మెంట్ అని.. కట్టుకున్న భార్యని సరిగా చూసుకోనివాడిని, రాష్ట్రాన్ని సరిగా పాలిస్తాడా అని మంత్రి ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో ఎనిమిది పార్టీలతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారని... విశాఖపట్నం ఎట్టి పరిస్ధితుల్లో రాజధాని అయి తీరుతుందని గుడివాడ స్పష్టం చేశారు. చంద్రబాబును కలవడానికి రూట్ మ్యాప్ కోసం ఎదురుచూశాడని.. ఈరోజు సరిగ్గా టైం దొరికిందని అమర్‌నాథ్ ఆరోపించారు. ఎంతమంది రాక్షసులు కలిసి వచ్చినా తమ విజయం తథ్యమని.. ఆయన పవన్ కల్యాణ్ కాదు, ప్యాకేజ్ కళ్యాణ్, పెళ్లిళ్ల కల్యాణ్ అంటూ మంత్రి సెటైర్లు వేశారు. 

చంద్రబాబు, పవన్ కొత్త బంధాన్ని మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. విశాఖ గర్జనను మీ ఇద్దరి కలయిక కోసం ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ముఖచిత్రం మారబోతోందన్న పవన్ రేపటి దాకా కూడా ఆగలేకపోయారంటూ గుడివాడ సెటైర్లు వేశారు. విశాఖ గర్జనను, ఉత్తరాంధ్ర ప్రజల ఉద్యమం నుంచి రాష్ట్రప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి ఆరోపించారు. విశాఖలో మంత్రులపై దాడి చేయడమే కాకుండా.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటున్నారని అమర్‌నాథ్ ఫైర్ అయ్యారు. 

Also Read:ప్లాన్ చేసుకున్న మీటింగ్ కాదు.. అనుకోకుండానే కలిశా : పవన్‌తో భేటీపై చంద్రబాబు

ఇద్దరూ కలిసి రాజకీయంగా ముందుకు వెళ్లాలనుకుంటే వెళ్లాలన్నారు. జనసేనను స్థాపించిన నాటి నుంచి నేటి వరకు జరుగుతున్న ప్రతి వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని గుడివాడ చెప్పారు. పవన్ మనుషులు వైసీపీ వాళ్లని కొట్టారా..? వైసీపీ వాళ్లు పవన్ అనుచరుల్ని కొట్టారా అన్నది చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. వైసీపీ వాళ్లని జనసేన వాళ్లు కొడితే.. కొట్టిన వాళ్లనే చంద్రబాబు పరామర్శిస్తారా అని గుడివాడ ప్రశ్నించారు. అందరూ కలిసి ఏకమవుతారో, ఏం చేస్తారో చేయాలంటూ ఆయన సవాల్ విసిరారు. నీ మూడో భార్య నిన్ను వదిలేసి వుంటుందని.. అందుకే అంతగా ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నావా అంటూ గుడివాడ ఫైర్ అయ్యారు. 

చంద్రబాబుకు అమ్ముడుపోయాడన్న మాటను పవన్ ఇవాళ రుజువు చేశారని అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. నువ్వు కాపు కులమో కాదో పక్కనబెడితే.. చంద్రబాబుకు అనుకూలమంటూ మంత్రి సెటైర్లు వేశారు. ప్రజాస్వామ్యంలో చెప్పుతో కొట్టడం అంటే తెలుసా అని గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. గాజువాకలో , భీమవరంలో కొట్టారే అది చెప్పుతో కొట్టడం అంటే అంటూ ఫైర్ అయ్యారు. రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు బయటికి రాకుండా చేయాలన్నదే చంద్రబాబు, పవన్ లక్ష్యమని గుడివాడ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పెద్ద విలన్ అని అమర్‌నాథ్ మండిపడ్డారు.
 

click me!