చంద్రబాబుతో భేటీకి డుమ్మా: జగన్ తో భేటీకి మేడా రెడీ

By pratap reddyFirst Published Jan 22, 2019, 1:00 PM IST
Highlights

రాజంపేట నియోజకవర్గం పంచాయతీని పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గం నేతలతో ఓ వైపు సమావేశమవుతుంటే, జగన్ తో భేటీని మేడా మల్లికార్డున్ రెడ్డి ఖరారు చేసుకున్నారు. 

హైదరాబాద్: రాజంపేట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మేడా మల్లికార్జున్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ చేరడం ఖరారైంది. ఆయన మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలనున్నారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో ఈ భేటీ జరుగుతుంది.

రాజంపేట నియోజకవర్గం పంచాయతీని పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గం నేతలతో ఓ వైపు సమావేశమవుతుంటే, జగన్ తో భేటీని మేడా మల్లికార్డున్ రెడ్డి ఖరారు చేసుకున్నారు. 

చంద్రబాబుతో భేటీకి వెళ్లకుండా మేడా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి నిర్ణయించుకున్నారు. తన సోదరుడు రఘునాథ రెడ్డి కోసమే మేడా మల్లికార్జున్ రెడ్డి మాట మార్చారని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఆరోపించారు. 

మేడా మల్లికార్డున్ రెడ్డి పార్టీ మారుతారంటూ గత కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారాన్ని మేడా మల్లికార్డున్ రెడ్డి నిజం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

మేడా మాట మార్చారు, సోదరుడి కోసమే..: సిఎం రమేష్

అమరావతిలో రాజంపేట పంచాయతీ: బాబుతో మేడా వ్యతిరేక వర్గం భేటీ

మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఔట్: తెరమీదికి చరణ్ రాజు

అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

టీడీపీలో రాజంపేట లొల్లి: మేడాకు అందని ఆహ్వానం

బాబుకు షాక్: ఎమ్మెల్యే మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ వైపు చూపు

click me!