నాడు ఎమ్మెల్యే బాలరాజు కిడ్నాప్... నేడు ఎమ్మెల్యే కిడారి హత్య

By narsimha lodeFirst Published Sep 24, 2018, 1:28 PM IST
Highlights

విశాఖ జిల్లాలో ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన ఘటనలు గతంలో చోటు చేసుకొన్నప్పటికీ... హత్య చేయడం మాత్రం ఇదే తొలిసారి.విశాఖ జిల్లాలో 1991 నుండి మావోయిస్టులు ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.

అరకు: విశాఖ జిల్లాలో ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన ఘటనలు గతంలో చోటు చేసుకొన్నప్పటికీ... హత్య చేయడం మాత్రం ఇదే తొలిసారి.విశాఖ జిల్లాలో 1991 నుండి మావోయిస్టులు ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకొన్న ఘటనే అతి పెద్దదిగా  పోలీసులు చెబుతున్నారు.

1991లో నుండి విశాఖ జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతూవస్తోంది.మావోయిస్టులు ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం. కిడ్నాప్‌లు చేయడం సాగుతున్నప్పటికీ.. హత్య చేయడం మాత్రం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

1993 నవంబర్ ‌మాసంలో విశాఖ ఏజెన్సీలో చింతపల్లి ఎమ్మెల్యేగా ఉన్న పసుపులేటి బాలరాజును  మావోలు  కిడ్నాప్ చేశారు.బూదరాళ్ల అటవీ ప్రాంతంలో బంధించారు.  గుడ్లపల్లి చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే సందర్భంలో మావోలు బాలరాజును కిడ్నాప్ చేశారు.

బాలరాజుతో పాటు మరో 9 మందికి అప్పట్లో మావోలు కిడ్నాప్ చేశారు. వరంగల్ జైల్లో ఉన్న  నక్సల్ నేత క్రాంతి రణదేవ్‌ను విడిచిపెట్టాలనే డిమాండ్‌తో బాలరాజును కిడ్నాప్ చేశారు. 

అప్పటి కాంగ్రెస్ పార్టీ నేత ద్రోణంరాజు సత్యనారాయణ ప్రభుత్వానికి, నక్సలైట్ల మధ్య సయోధ్య నడిపి చివరకు రణదేవ్‌ను వరంగల్ జైల్ నుండి విశాఖ సెంట్రల్ జైల్ కు తరలించారు. అక్కడి నుండి అతడికి విశాఖ మన్యానికి తరలించారు. 

1996లో చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు  శ్రీనివాస్ ను మావోలు హత్య చేశారు. ఆ సమయంలో అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్నాడు. 
2004లో అప్పటి గిరిజన శాఖ మంత్రిగా మణికుమారి భర్త వెంకటరాజును మావోలు కాల్చిచంపారు. 2007లో బాక్సైట్ ఉద్యమంలో పాల్గొనాలని మావోలు హెచ్చరించారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను హత్య చేశారు. 

మరోవైపు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలను ఆదివారం నాడు మావోలు కాల్చిచంపారు. ఎమ్మెల్యే స్థాయి నేతలను  పోలీసులు కాల్చి చంపడం ఇదే ప్రథమం.
 

సంబంధిత వార్తలు

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

click me!
Last Updated Sep 24, 2018, 1:28 PM IST
click me!