అరకు ఘటనపై స్పందించిన ఏపీ స్పీకర్ కోడెల

By ramya neerukondaFirst Published Sep 24, 2018, 12:37 PM IST
Highlights

అదేవిధంగా మావోల చేతిలో కన్నుమూసిన ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు.
 

విశాఖ మన్యంలో ఇద్దరు నేతలు మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. అరకు ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా మావోల చేతిలో కన్నుమూసిన ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు.

గాంధీజీ 150 జయంతోత్సవాల సందర్భంగా గుంటూరు రైల్వేస్టేషన్లో జాతిపిత స్వాతంత్రోద్యమ ఘట్టాలను తెలియజేసేలా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను సభాపతి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోడెల తో పాటు ఎంపీ కనకమేడల రవీంద్ర బాబు, డీఆర్ఎం వీజీ భూమా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హింస, దాడుల ద్వారా ఎవరూ ఏమీ సాధించలేరు అన్నారు. అరకు ఘటన గాంధీజీ విధానాలకు పూర్తిగా వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. ప్రపంచాన్నే గడగడలాడించిన బ్రిటిష్ పాలకుల్ని .. అహింసా విధానం ద్వారా ఓడించిన బాపూజీ మార్గం అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ శిరోధార్యమని చెప్పారు. గాంధీజీ... స్వేచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ కోరుకున్నారని....రెండోది ఇంకా సాధించవలసిన అవసరముందన్నారు.

click me!
Last Updated Sep 24, 2018, 12:37 PM IST
click me!