బాబ్లీ కేసు: ధర్మాబాద్‌ కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేయనున్న రవీంద్రకుమార్

By narsimha lodeFirst Published Sep 21, 2018, 10:16 AM IST
Highlights

బాబ్లీ పోరాటం సందర్భంగా నమోదైన కేసుల్లో ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారంట్‌పై  రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.

అమరావతి: బాబ్లీ పోరాటం సందర్భంగా నమోదైన కేసుల్లో ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారంట్‌పై  రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.  ఈ మేరకు  తన తరపున  న్యాయవాది, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ను  పంపారు.

2010 జూలై 16వ తేదీన అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర విపక్షనేత చంద్రబాబునాయుడు టీడీపీ ప్రజా ప్రతినిధులతో కలిసి బాబ్లీ ప్రాజెక్టును సందర్శించారు.  దీంతో అప్పటి మహారాష్ట్ర సర్కార్ చంద్రబాబునాయుడు సహా పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులను  అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఆనాడు కేసులు పెట్టలేదని తమకు ఆనాడు మహారాష్ట్ర సర్కార్ చెప్పిందని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.  అయితే  ఈ కేసు విషయమై ఇప్పటివరకు  ఎలాంటి సమన్లు కూడ జారీ చేయలేదనికూడ టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారంట్‌పై  రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు టీడీపీ ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ నేతృత్వంలో న్యాయవాదుల బృందం ధర్మాబాా్ కోర్టుకు వెళ్లింది. ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్  వారంట్‌పై రీకాల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. 
 

సంబంధిత వార్తలు

బాబ్లీ కేసుపై రేపే విచారణ : తెలంగాణ నేతలిద్దరు స్వయంగా హాజరయ్యే అవకాశం

బాబ్లీకేసు: రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని బాబు నిర్ణయం

నాన్ బెయిలబుల్ వారంట్‌పై బాబు మల్లగుల్లాలు: ఏం చేద్దాం?

నాకెందుకు నోటీసులు ఇవ్వలేదంటున్నకేంద్ర మాజీ మంత్రి

ధర్మాబాద్ కోర్టు నోటీసులపై స్పందించిన బాబు

అవసరమైతే బాబును అరెస్ట్ చేస్తాం: నాందేడ్ ఎస్పీ సంచలనం

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్‌తో మాకేం సంబంధం: పురంధేశ్వరీ

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్: సీఎస్‌తో టీటీడీపీ నేతల భేటీ
'ఐక్యరాజ్యసమితి ప్రసంగాన్ని అడ్డుకోవడానికే బాబుకు నోటీసులు'

బాబుకు నాన్‌ బెయిలబుల్ వారంట్: టీ.టీడీపీ నేతల అత్యవసర సమావేశం

నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 మంది నేతలు వీరే...

బాబ్లీ ప్రాజెక్టు కేసు: నాడు బాబును ఎందుకు అరెస్ట్ చేశారంటే?

బాబ్లీ ప్రాజెక్టు కేసు: చంద్రబాబుకు త్వరలో ధర్మాబాద్ కోర్టు నోటీసులు

click me!