కూతురు మరణం.. భార్య మరణం అంచుల్లో

By ramya neerukondaFirst Published Sep 21, 2018, 9:45 AM IST
Highlights

ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగోలేని కారణంగా ఒకరి గురించి మరొకరికి తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తపడ్డారు. ఒక వైపు భార్య, మరో వైపు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కుమార్తె... ఇద్దరూ దీన స్థితిలో ఉండటంతో  వాసుదేవరావు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. 

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ల ముందే కన్నుమూసింది. ఆ  విషయాన్ని కట్టుకున్న భార్యకు చెప్పుకోలని పరిస్థితి ఆయనది. భార్య కూడా చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషయం చెప్పలేక మూడు రోజులుగా తనలో తాను కుమిలిపోతున్న ఓ తండ్రి ఆవేదన చూట్టూ ఉన్న వారిని, కుటుంబీకులను కలచివేస్తోంది. ఈ హృదయ విదార సంఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని విశ్రాంత అధ్యాపకుడు దంత సింహబలుడు కుమార్తె శ్రీదేవి, అల్లుడు వాసుదేవరావు. ఉద్యోగ రీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు. వీరి ఏకైక కుమార్తె సాయిప్రత్యూష. విశాఖపట్నంలోని ఓ కళాశాలలో బి.బి.ఎ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. తల్లి శ్రీదేవి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుండగా, తండ్రి వాసుదేవరావు ఓ బ్యాంకులో సహాయ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 

ప్రత్యూషకి ఈ నెల 9వ తేదీన డెంగీ జ్వరం రావటంతో విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు ప్రారంభించారు. ఆమె తల్లి శ్రీదేవి బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతుండటంతో అదే ఆసుపత్రిలో చేర్పించారు. కుమార్తె అనారోగ్య పరిస్థితి ఆమెకు చెప్పి బాధపెట్టకూడదనుకున్న కుటుంబ సభ్యులు ప్రత్యూష పరిస్థితిని వివరించలేదు. మరో వైపు 11వ తేదీన శ్రీదేవి ఆరోగ్యం విషమ పరిస్థితికి చేరింది. ఈమె  పరిస్థితి గురించి కుమార్తెకూ తెలియజేయలేదు.

 
ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగోలేని కారణంగా ఒకరి గురించి మరొకరికి తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తపడ్డారు. ఒక వైపు భార్య, మరో వైపు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కుమార్తె... ఇద్దరూ దీన స్థితిలో ఉండటంతో  వాసుదేవరావు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. డెంగీ తీవ్ర స్థాయికి చేరటంతో రెండు రోజుల క్రితం ప్రత్యూష కన్నుమూసింది. జీవితాంతం తోడుంటానని మాటిచ్చిన భార్య అనారోగ్యంతో పోరాటం చేస్తోంది. ఒక్కగానొక్క కుమార్తె కుటుంబాన్ని విషాదంలో ముంచి వెళ్లిందన్న దుఃఖంతో కన్నీటి పర్యంతమయ్యారు. కుమార్తె మరణించి రెండు రోజులు గడిచినా ఇప్పటికీ తన భార్యకు విషయాన్ని తెలియజేయలేని దీన స్థితిలో ఉన్నాడా తండ్రి. కుమార్తె చివరి చూపు సైతం తల్లికి దక్కకపోవడం తలుచుకుని కుమిలిపోతున్నాడు.

click me!