లోక్ సత్తా పార్టీలో చేరిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

By ramya neerukondaFirst Published Nov 26, 2018, 1:55 PM IST
Highlights

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారయణ సోమవారం లోక్ సత్తా పార్టీలో చేరారు. 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారయణ సోమవారం లోక్ సత్తా పార్టీలో చేరారు. గత కొంతకాలంగా జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారని.. ఓ నూతన పార్టీ ఏర్పాటు చేస్తున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. మొదట పార్టీ పెట్టాలనే ఆయన నిర్ణయించారు.. కానీ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల్లో చేరతారంటూ ఆయనపై పుకార్లు వచ్చాయి. వాటన్నింటికీ పులుస్టాప్ పెడుతూ లోక్‌సత్తాలో తాను చేరుతున్నానంటూ లక్ష్మీనారాయణ సోమవారం ప్రకటించారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. 

మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న లక్ష్మీనారాయణ డిప్యూటేషన్‌పై సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి.. సత్యం కంప్యూటర్స్, జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్థన్ రెడ్డి మైనింగ్ కేసులను డీల్ చేసి సంచలనం సృష్టించారు.

ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేసి నిజాయితీ గల అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. డిప్యూటేషన్ కాలం పూర్తికావడంతో ఆయన తిరిగి మహారాష్ట్ర వెళ్లిపోయారు. అయితే ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు. ఇప్పుడు ఇలా.. లోక్ సత్తా పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుడుపెట్టారు. 

 

read more news

కొత్త పార్టీ కాదు.. లోక్‌సత్తా అధినేతగా జేడీ లక్ష్మీనారాయణ..?

రాజకీయాల్లోకి జేడీ లక్ష్మీనారాయణ...26న పార్టీ ప్రకటన

కేసీఆర్ పై మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం

జనసేనలోకి జేడీ లక్ష్మీనారాయణ .. ఆగస్ట్ 14న ముహూర్తం ?

లక్ష్మీనారాయణ కొత్త పార్టీ: ‘‘జేడీ’’ కలిసొచ్చేలా.. పార్టీ పేరులోనూ ‘‘జేడీ’’

రావాలనుకుంటే కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా: సీబీఐ మాజీ జేడీ

వైఎస్ భారతిపై కేసు మీద మాజీ జేడీ లక్ష్మినారాయణ స్పందన ఇదీ

 

click me!