చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ ఉన్నత విద్యావంతుల కుటుంబానికి చెందినవాడుగా చెబుతుంటారు.
తిరుపతి: చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్ తండ్రి రిటైర్డ్ రెవిన్యూ అధికారి. డిప్యూటీ తహసీల్దార్ గా ఆయన రిటైరయ్యారు. ఎన్.శివప్రసాద్ కుటుంబం ఉన్నత విద్యావంతుల కుటుంబంగా చెబుతారు.
చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్ చిన్నతనం నుండే విద్యపై ఎక్కువగా శ్రద్ద పెట్టేవారని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు.తండ్రి రెవిన్యూ శాఖలో పనిచేస్తున్న సమయంలో కూడ శివప్రసాద్ ప్రభుత్వ స్కూల్లోనే చదివాడు. చిన్నతనం నుండే శివప్రసాద్ కు ఆదర్శభావాలు ఉండేవని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకొంటున్నారు.
undefined
శివప్రసాద్ వైద్య వృత్తిని చేపట్టిన తర్వాత డాక్టర్ ను వివాహం ఆడాడు. డాక్టర్ శివప్రసాద్ కులాంతర వివాహం చేసుకొన్నాడు. ఎన్. శివప్రసాద్ ఇద్దరు కూతుళ్లను కూడ తన బంధువులకే ఇచ్చి పెళ్లి చేశాడు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ కూడ పోటీ చేయాలని భావించారు. కానీ, చంద్రబాబునాయుడు ఈ ఇద్దరికి కూడ టిక్కెట్లు ఇవ్వలేదు.చిత్తూరు నుండి శివప్రసాద్ కు మాత్రమే టిక్కెట్టు ఇచ్చారు. ఈ దపా శివప్రసాద్ ఓటమి పాలయ్యారు.
సంబంధిత వార్తలు
ఒకే స్కూల్లో చదివిన శివప్రసాద్, బాబు: ప్రతి రోజూ కాలినడకే
మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి: సీఎం జగన్ సంతాపం
ప్రత్యేక హోదా ఉద్యమం: శివప్రసాద్ వేసిన విచిత్ర వేషాలు ఇవే
వారంలో ఇద్దరు నేతలను కోల్పోయాం: చంద్రబాబు ఆవేదన
హోదా ఉద్యమంలో శివప్రసాద్ స్పెషల్ రోల్: దేశం దృష్టిని ఆకర్షించిన మాజీ ఎంపీ
చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత
శివప్రసాద్ సినీ కెరీర్.. చెరగని ముద్ర!