డాక్టర్ శిల్ప సూసైడ్: 'ఆ నివేదిక ఆలస్యానికి బాధ్యులపై చర్యలకు డిమాండ్'

By narsimha lodeFirst Published Aug 10, 2018, 1:48 PM IST
Highlights


తిరుపతి: ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్  రమణయ్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని  ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం  ఈ నెల 13 వ తేదీవరకు  ప్రతి రోజూ గంట పాటు విధులను బహిష్కరించి ఆందోళన నిర్వహించనున్నట్టు చెప్పారు

తిరుపతి: ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్  రమణయ్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని  ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం  ఈ నెల 13 వ తేదీవరకు  ప్రతి రోజూ గంట పాటు విధులను బహిష్కరించి ఆందోళన నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ నెల 13వ తేదీన ప్రభుత్వంతో చర్చల తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు  ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది.

డాక్టర్ శిల్ప ఆత్మహత్య విషయంలో ప్రోఫెసర్లు, హెచ్ఓడీపై  ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో  ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్  అత్యవసరంగా గురువారం నాడు రుయా ఆసుపత్రిలో సమావేశమైంది. 

ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రమణయ్యను  తొలగించడంపై ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ చేయకుండానే రమణయ్యను తొలగించడంపై  అసోసియేషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.  విచారణలో రమణయ్య దోషిగా తేలితే చర్యలు తీసుకోవాలని కోరింది.  మరోవైపు  డాక్టర్ శిల్ప మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ కోరింది.

వైద్య అధ్యాపకులపై బురదచల్లే పద్దతులను మానుకోవాలని అసోసియేషన్ కోరింది. డాక్టర్ శిల్ప  చేసిన ఆరోపణలపై  ఏర్పాటు చేసిన రెండో కమిటీ నివేదిక ఎందుకు ఆలస్యమైందనే విషయమై  నివేదిక ఇవ్వాలని కూడ అసోసియేషన్ డిమాండ్ చేసింది.మరోవైపు డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో కూడ సమగ్ర విచారణను ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ కోరింది. జ్యూడీషీయల్ విచారణకు  డాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.  

ఈ నివేదిక  ఇవ్వడానికి  ఆలస్యం చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని  అసోసోయేషన్ డిమాండ్ చేసింది. ఈ నెల 13వ తేదీ వరకు ప్రతి రోజూ గంటపాటు  విధులు బహిష్కరించి ఆందోళన చేయనున్నట్టు డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నెల 13వ తేదీన ప్రభుత్వంతో చర్చల తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు  డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది.

 

ఈ వార్తలు చదవండి: డాక్టర్ శిల్ప సూసైడ్: అట్టుడుకుతున్న ఎస్వీ మెడికల్ కాలేజీ

డాక్టర్ శిల్ప సూసైడ్: సీఐడీ విచారణ షురూ, కొనసాగుతున్న ఆందోళన

డాక్టర్ శిల్ప ఆత్మహత్య: ఆ నివేదికలో ఏముంది?

డాక్టర్ శిల్ప సూసైడ్: డాక్టర్ రవికుమార్‌పై వేటు, మరో ఇద్దరిపై చర్యలకు డిమాండ్

డాక్టర్ శిల్ప సూసైడ్: ఆ నివేదిక ఏమైంది, ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

డ్యూటీకి రావాలంటే భయంగా ఉంది: ఆత్మహత్యకు ముందు డాక్టర్ శిల్ప

click me!