గంటసేపు కళ్లు మూసుకొంటే మేమేంటే చూపిస్తాం:పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Oct 22, 2021, 11:52 AM IST
Highlights

ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత  శుక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక గంట సేపు కళ్లు మూసుకొంటే మేమేంటో చూపిస్తామన్నారు. వైసీపీకి చుక్కలు చూపిస్తామని ఆమె హెచ్చరించారు.
 

అనంతపురం: Chandrababu సీఎం అయ్యాక గంట కళ్లు మూసుకొంటే  మేమేంటో చూపిస్తామని  మాజీ మంత్రి Paritala Sunitha సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం నాడు ఆమె చంద్రబాబు దీక్షకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక ycpకి చుక్కలు చూపిస్తామని ఆమె హెచ్చరించారు.మా ఒంట్లో కూడా సీమ రక్తమే ప్రవహిస్తోందన్నారు. తన భర్త పరిటాల రవి హత్యకు గురైన సమయంలో కూడ  తమను ఓర్పుగా ఉండాలని చంద్రబాబు సూచనలు చేశారని ఆమె గుర్తు చేసుకొన్నారు.

ఇప్పటికైనా చంద్రబాబు తీరు మారాలని ఆమె కోరారు.మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఊ అంటే మంత్రులను కూడా తిరగనివ్వం, మేం తిట్టగలం, మాకూ బీపీ వస్తోందన్నారు. ఏం చేస్తామో త్వరలోనే చూపిస్తామని ఆమె చెప్పారు.Tdp  కార్యాలయంతో పాటు ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ దాడులను ఉద్దేశించి పరిటాల సునీత ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి బూతు వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులకు దిగారు. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై కూడ దాడి చేశారు. ఈ దాడులను నిరసిస్తూ చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే 36 గంటల దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష ఇవాళ రాత్రి 8 గంటలకు ముగియనుంది.మరో వైపు రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేస్తున్న మంచిపనులను చూసి ఓర్వలేకే టీడీపీ విద్వేషాలు రగిల్చే కుట్రలకు పాల్పడిందని జగన్ ఆరోపించారు. గిట్టనివారు పాలన సాగిస్తున్నందునే టీడీపీ నేతలు ఇలా వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. 

also read:ఏపీ సీఎం జగన్ పై బూతు వ్యాఖ్యలు:రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి తరలింపు

ఈ విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే చంద్రబాబు లేఖలు రాశారు. మరోవైపు ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం బాబు ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. మరోవైపు బూతు వ్యాఖ్యలు చేసిన టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని  వైసీపీ నేతలు ఈసీకి లేఖ రాయనున్నారు. 

click me!